Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ EMK షో లో సమంత..!

By:  Tupaki Desk   |   7 Oct 2021 2:55 PM GMT
ఎన్టీఆర్ EMK షో లో సమంత..!
X
దక్షిణాది అగ్ర కథానాయిక సమంత తన భర్త అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన సంగతి తెలిసిందే. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న సామ్.. చై తో నాలుగేళ్ళ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పింది. దీనికి కారణాలు ఎంటనేది తెలియనప్పటికీ.. సమంత విడాకుల వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇదిలావుంటే సమంత ఈ కష్టకాలం నుంచి త్వరగా బయటకు రావాలని నిర్ణయించుకుంది. ఎప్పటిలాగే షూటింగ్ లతో బిజీ అవడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సమంత ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ ఫోటో షూట్ కు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' షో కు సెలెబ్రెటీ గెస్టుగా హాజరైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ గేమ్ షో లో సామ్ పాల్గొన్న ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ గురువారం జరిగినట్లు తెలుస్తోంది. సమంత మేనేజర్ మహేంద్రతో కలిసి 'EMK' కార్యక్రమంలో అందుకున్న చెక్ ను చూపిస్తూ సమంత దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అంతేకాదు సెట్ లో తీసిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నాగచైతన్య తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత సమంత ఫస్ట్ పబ్లిక్ అప్పీయరన్స్ ఇదే కానుంది. సామ్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో లో ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పింది.. ఎంత అమౌంట్ గెలుచుకుంది అనేది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది. దీని తర్వాత ఎన్టీఆర్ తో సమంత చేసిన ఎపిసోడ్ వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే తారక్ - సమంత జంటగా ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. తొలిసారి 'బృందావనం' సినిమాలో కనువిందు చేసిన వీరిద్దరూ.. ఆ తర్వాత 'రామయ్యా వస్తావయ్యా' 'రభస' 'జనతా గ్యారేజ్' వంటి చిత్రాల్లో అలరించారు. ఆన్ స్క్రీన్ లో ఎన్టీఆర్ - సామ్ మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుంటారు. మరి 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో లో ఇద్దరి మధ్య సంభాషణ ఏ విధంగా సాగిందో చూడాలని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చైతన్య తో విడాకుల వ్యవహారం గురించి కూడా తారక్ ఏమైనా ప్రశ్నలు అడిగారేమో అని ఆలోచిస్తున్నారు.