Begin typing your search above and press return to search.
సమంత వెటకారం: ఏం చేస్తుంటారాయన?
By: Tupaki Desk | 14 April 2015 10:10 AM ISTసన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో అవకాశాలు తగ్గాయి అనే గాసిప్స్ బారిన పడిన సమంత ఆ సినిమా ప్రమోషనో లేక ఈమె ప్రమోషనో తెలియదు కానీ... ప్రతీ రోజూ ఏదో ఒక ఛానల్ కో, పత్రికకో, వెబ్ మీడియా కో ఇంటర్యూలు ఇస్తూనే ఉంది. తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెబుతూనే... వ్యగంగా కూడా బాగానే స్పందించింది. ఏ ప్రశ్నకు ఏ సౌండ్ తో సమాధానం చెప్పాలో బాగా నేర్చేసుకున్న సమంత ఆ స్థాయి నటన ఇంటర్వ్యూల్లో కూడా చూపించేస్తుంది.
హీరో సిద్దార్థ తో విభేదాలు వచ్చి విడిపోయారు అని వినిపిస్తున్న వార్తల తర్వాత... తాజాగా తమిళనాడులోని ఒక బిజినెస్‌మెన్ తో సమంత డేటింగ్ చేస్తుంది అని వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నకు స్పందించిన సమంత... కోపాన్ని అణుచుకున్న తర్వాత వచ్చే వెటకారంతో... " చెన్నై బిజినెస్‌మెనా!! ఏం చేస్తుంటారాయన? నాకు మీరు ఆయన్ని పరిచయం చేస్తే వెతికే పని తగ్గిపోతుంది. ఆ బిజినెస్‌మెన్ నెంబర్ తెలిస్తే వెంటనే నాకు ఇవ్వండి. నేను కూడా ట్రై చేసుకుంటాను. బిజినెస్‌మెన్ అనగానే నాకు వెంటనే ఇంట్రస్ట్ కలిగింది" అంటూ గుక్క తిప్పుకోకుండా సెటర్స్ తో కూడిన సమాదానాలు చెప్పింది. ఎంత కోపమో పాపకి!! కాకపొతే కోపం రావడం, దాన్ని దిగమింగి వెటకారంగా మలచడం ప్రేమ లో విఫలమయిన వారికో, జీవితంలో ఎదురుదెబ్బలు బాగా తిన్నవారికో వస్తాయి అంటుంటారు... సమంత మాటలు వింటే అలానే అనిపిస్తుంది కదా!