Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఇంతటి అందం ఇలలోనే లేదే

By:  Tupaki Desk   |   12 April 2015 3:30 AM GMT
ఫోటో స్టోరి: ఇంతటి అందం ఇలలోనే లేదే
X
మాయావివా నువ్వు మంత్రకత్తవా? అసలు ఏమి ఈ దివ్య రూపం? అందాల సమంతను చూసినవారికి ఇలాంటి సందేహాలే వస్తాయి. అసలు ఈ భామని అభినవ మాంత్రికురాలు అంటే తప్పేమీ కాదేమో! తన వద్ద రహస్యంగా ఏదైనా మంత్ర దండం ఉందా? ఫ్యాషన్‌లు మార్చేసే మాయలు, మంత్రాలు ఉన్నాయా? ఏమో..! అప్పటికిప్పుడు రూపం మార్చుకునే విద్యలేవైనా తనచెంత ఉన్నాయేమో! ప్చ్‌.. ఉంటే ఉండే ఉండొచ్చులెండి.

ఈ క్షణం ఒకలా కనిపిస్తే, మరుక్షణం మరో రకంగా కనిపిస్తుంది. తెరపై చూసినప్పుడు ఒకలా, బైటి ప్రపంచంలో తిరిగినప్పుడు ఇంకోలా మారిపోతోంది. ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా అలరిస్తోంది. ఏ క్షణం ఎప్పుడు ఏ రూపంలో కనిపిస్తుందో ఊహించడం అస్సలు ఎవరివల్లా కాదేమో! ఈ అమ్మడు నటించిన సన్నాఫ్‌ సత్యమూర్తి థియేటర్లలో రిలీజై సందడి చేస్తోంది. ఈలోగానే సమంత ఓ ట్రెండీ లుక్‌లో బైట సందడి చేస్తోంది. ఆ ఫోటో ఒకటి ట్విట్టర్‌లోకొచ్చింది. సమంత వ్యక్తిగత డిజైనర్‌ నీరజ కోన ఆ పిక్‌ని పోస్ట్‌ చేసింది. చూడగానే కార్పొరెట్‌ లుక్‌ని తలపిస్తున్న ఈ స్టయిల్‌ సమంత ఆల్బమ్‌లోనే వెరీ స్పెషల్‌ అంటే తప్పేమీ కాదు.

బ్లాక్‌ టైట్‌ఫిట్‌కి పచ్చరంగు బాటమ్‌ కాంబినేషన్‌... బ్లాక్‌ డ్రెస్‌పై అదిరిపోయే డిజైనింగులో వజ్రాభరణం.. ఈ లుక్‌ డిజైన్‌ చేసిన నీరజను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. హ్యాట్సాఫ్‌ టు నీరజ కోన. కార్పొరెట్‌ గుండెల్లో కలల రాకుమారిని తలపిస్తోంది! ఇంతటి అందం ఇలలో లేనె లేదు సుమీ అని పాటేసుకోవాల్సిందే..