Begin typing your search above and press return to search.
ఒక్క ట్వీటైనా వేయేలేదే సమంతా?
By: Tupaki Desk | 14 Jan 2016 6:30 AM GMTఅందాల సమంత ఇటీవలి కాలంలో చడీచప్పుడు చేయట్లేదెందుకో? అప్పట్లో ఉన్నంత యాక్టివ్ గా ఆన్ లైన్ లో పార్టిసిపేట్ చేయడం లేదు. ట్విట్టర్ - ఫేస్ బుక్ తనకి ఓ హాబీగా ఉండేవి. కానీ ఇప్పుడు వీటన్నిటికీ స్వస్థి చెప్పేసింది. నేరుగా అభిమానులతో ట్వీట్ లు చేస్తూ అందరికీ టచ్ లో ఉండే సమంత ఉన్నట్టుండి ఇలా అయ్యిందేంటబ్బా అంటూ టాలీవుడ్ లో ముచ్చట్లు సాగుతున్నాయ్. చక్కనమ్మ ఇలా గమ్మునుంటే కుర్రాళ్లందరికీ ఊసుపోని సన్నివేశం ఎదురవుతోంది. అసలు సమంతా ఎందుకిలా చేస్తున్నావ్.? అంటూ అంతా అలకపానుపు ఎక్కేస్తున్నారు.
డిసెంబర్ 31 రేయి ఏం చేసిందో గుట్టు చప్పుడు కాకుండా మ్యానేజ్ చేసేసింది. ఆ విషయాన్ని ట్వీట్టర్ లో చెప్పనేలేదు. జనవరి 1 వచ్చింది కదా అని అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అయినా చెబుతుందనుకుంటే అదీ లేదు. ఇప్పుడు ఏకంగా సంక్రాంతి వచ్చేస్తోంది. ఇంతవరకూ ఒక్క ట్వీటు కూడా లేదు. పొంగల్ సంబరాల గురించి ముచ్చటించిందే లేదు. అసలెందుకిలా చేస్తోంది? ట‌్విట్టర్ నుంచి పూర్తిగా ఎగ్జిట్ అయినట్టేనా? ఇంతకుముందు కూడా ఓ సారి ఇలానే ఎగ్జిట్ అయ్యి ఏడాది క్రితమే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. మరి ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఇలా చేస్తోందనుకోవాలా? బ‌్రహ్మోత్సవం, అ... ఆ చిత్రీకరణ పూర్తయ్యే వరకూ ఈ అమ్మడు ఎవరికీ టచ్ లోకి రాదంటారా? ప‌్చ్ ! ఏమో?