Begin typing your search above and press return to search.

చైతుతో పోటీకి కారణం చెప్పిన సామ్

By:  Tupaki Desk   |   2 Sep 2018 7:55 AM GMT
చైతుతో పోటీకి కారణం చెప్పిన సామ్
X
ఈ నెల 13 కోసం అక్కినేని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కారణం ఆ కుటుంబం నుంచి ఒకేరోజు భార్యాభర్తల సినిమాలు పోటీలో ఉండటమే. నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు ఎట్టకేలకు 13 డేట్ ని లాక్ చేసుకోగా సమంతా యు టర్న్ అంతకు పది రోజుల ముందే ఆ తేదీ మీద కర్చీఫ్ వేసేసింది. ఎవరూ రాజీ పడలేని పరిస్థితి నెలకొనడంతో సై అంటే సై అనక తప్పలేదు. అభిమానులు మాత్రం భర్త కోసం సమంతా ఏమైనా యు టర్న్ వాయిదా వేయిస్తుందేమో అని ఎదురు చూసారు కానీ అవేవి ఫలించలేదు. క్లాష్ సంగతి అలా ఉంచితే అసలు సమంతా మనసులో దీని గురించి ఏముంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దానికి బదులు చెప్పడం కోసమే అన్నట్టుగా ఈ విషయం గురించి సమంతా యు టర్న్ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది.

భర్త సినిమాతో తప్పనిసరిగా పోటీ పడాల్సిన పరిస్థితి రావడం యుటర్న్ దర్శకుడు పవన్ వల్లనట. తనతో పాటు నిర్మాత కూడా వాయిదాకు ఇష్టపడకపోవడంతో శైలజారెడ్డి అల్లుడు తో క్లాష్ తప్పలేదని చెప్పింది. అది కూడా వివాదం కోసమే ఇలా చేసి దాని ద్వారా సినిమా ఆడేలా చేయాలనేదే వాళ్ళ ప్లానట. మరి కంటెంట్ ని ఉద్దేశించి అలా అన్నదో లేక వివాదం అంటే భార్యాభర్తలను ఉద్దేశించి సరదాగా అనుకున్న పదమో దొరక్కుండా మాట్లాడింది. యుటర్న్ తమిళ్ లో కూడా విడుదల అవుతుంది కాబట్టి అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకునే డేట్ ఫిక్స్ చేశారనే టాక్ ఇప్పటికే ఉంది. ఇప్పుడు మార్చాలన్నా అక్కడ ఇబ్బంది ఎదురు కావొచ్చు. ఏమైనా రెండు పూర్తిగా ఒకదానికి ఒకటి సంబంధం లేని జానర్లు. కాబట్టి ఒకదాని మీద మరొకటి ప్రభావం చూపుతుంది అని చెప్పలేం కానీ ఓపెనింగ్స్ విషయంలో షేర్ పంచుకోక తప్పదు. సమంతా అంతా తానై నటించిన యుటర్న్ గురించి థ్రిల్లర్ గా ప్రీ టాక్ బాగానే ఉంది. అల్లుడిగా మాస్ మసాలా అవతారంలో చైతుని చూసి ఫ్యాన్స్ అంచనాలను అప్పుడే కోటలు దాటించేసారు. చూద్దాం ఈ రసవత్తర పోరులో ఇద్దరూ గెలుస్తారా లేక ఒకరిది పై చేయి అవుతుందా మరో పది రోజుల్లో తేలిపోతుంది.