Begin typing your search above and press return to search.
పిల్లలు పుడితే సమంత ప్లానింగ్ ఇదే
By: Tupaki Desk | 19 March 2019 5:36 AMఅక్కినేని నాగచైతన్య, సమంత సుదీర్ఘ కాలం ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరు పెళ్లికి ముందు మూడు సినిమాల్లో నటించారు. పెళ్లి అయినప్పటి నుండి వీరి కాంబోలో నాల్గవ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఒక మంచి సబ్జెక్ట్ దొరకడంతో 'మజిలీ' అనే టైటిల్ తో సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో అప్పుడే ఈ కపల్ పాల్గొంటున్నారు.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. వీరిద్దరు కూడా తమ వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక పిల్లల విషయంలో కూడా ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. గతంలోనే నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అంటూ సమంత ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి ఆ విషయంపై సమంత మాట్లాడుతూ... నేను ఎప్పుడు తల్లిని కావాలనుకుంటున్నానో చెప్పలేను. పరిస్థితులను బట్టి అది ఆధార పడి ఉంటుంది. అయితే నాకు బిడ్డ కనుక పుడితే మాత్రం అన్నింటిని పక్కకు పెట్టి పూర్తిగా తనకే టైం కేటాయిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. పిల్లలకు బాల్యంలో అందించాల్సినవన్నీ కూడా తన బిడ్డకు అందిస్తాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. నేను నా బాల్యంలో కోల్పోయిన సరదాలను మరియు నాను పొందలేక పోయిన బాల్యంను నా బిడ్డకు అందిస్తాను. అందుకోసం నేను సినిమాలకు కొంత కాలం పూర్తిగా దూరంగా ఉంటాను. నాకు పుట్టిన బిడ్డనే సర్వస్వంగా జీవిస్తాను అంటూ భవిష్యత్తు ప్రణాళికను సమంత వెళ్లడించింది.
సమంత మాటలు చూస్తుంటే ఎప్పుడైతే సినిమాల్లో ఆఫర్లు తగ్గుతాయో అప్పుడు బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్దం అయ్యేలా ఉంది. ఒన్స్ బిడ్డకు తల్లి అయిన తర్వాత సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కూడా అంగీకరించదేమో. బిడ్డకు 10 ఏళ్లు వచ్చే వరకు కూడా సమంత మళ్లీ సినిమాల మొహం చూడదేమో. సూర్య భార్య జ్యోతిక కూడా పిల్లలు పెద్ద అయిన తర్వాత మళ్లీ నటిగా కెరీర్ ను ప్రారంభించింది. అలాగే సమంత కూడా తన పిల్లలు పెద్ద వారు అయిన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్లానింగ్ చేసుకుంటుందేమో.