Begin typing your search above and press return to search.

సావిత్రి మేకర్స్ కు షాకిచ్చిన సమంత

By:  Tupaki Desk   |   14 Dec 2016 5:19 PM GMT
సావిత్రి మేకర్స్ కు షాకిచ్చిన సమంత
X
సావిత్రిపై 'మహానటి' బయోపిక్.. చాలా నెలలుగా టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఇది. అశ్వనీదత్ కూతురు ప్రియాంకదత్-స్వప్నదత్ లు నిర్మాతలు కాగా.. ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ దర్శకుడు.. ప్రియాంక దత్ భర్త అయిన నాగ్ అశ్విన్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. అయితే.. హీరోయిన్ విషయంలో క్లారిటీ రాక ఇంకా ఈ మూవీ పట్టాలెక్కలేదు.

మొదట మలయాళ భామ నిత్యామీనన్ ను ఈ పాత్ర కోసం అనుకున్నా.. తర్వాత చెన్నై బ్యూటీ సమంతతో సంప్రదింపులు జరిపారనే టాక్ ఉంది. అయితే.. సావిత్రిగా నటించేందుకు సమంత నో చెప్పేయడంతో.. ఇప్పుడు మేకర్స్ షాక్ తినేశారట. మహానటి పాత్రలో నటించేందుకు కాసింత బొద్దుగా తయారు కావాలని దర్శకుడు కోరడంతో.. పెర్ఫామెన్స్ విషయంలో అడగండి కానీ.. పర్సనాలిటీ విషయంలో మాత్రం కండిషన్స్ పెట్టద్దని తేల్చేసిందట సమంత. దీంతో చివరకు తప్పక మరోసారి నిత్యా మీనన్ నే సావిత్రి పాత్రకు ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు హీరోయిన్ అనే పదానికే గౌరవం తెచ్చిన మహానటి సావిత్రి పాత్రకు.. తెలుగమ్మాయిలను కాకుండా.. ఓ మలయాళ భామను తీసుకోవడం చాలా మందికి షాక్ కలిగించేస్తోంది.

అయితే సమంత తెలుగమ్మాయి కాదు కానీ.. ఇప్పుడామె తెలుగు వారికి కాబోయే కోడలు. ఆ యాంగిల్ లో కాస్త శాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఆడియన్స్ కు ఉంటుంది. కానీ తెలుగుకు ఏమాత్రం సంబంధం లేకపోయినా.. కేవలం ట్యాలెంటెడ్ బొద్దుగుమ్మ అనే రీజన్ తో నిత్యామీనన్ ని సావిత్రిగా చూడాల్సి రావడం.. వేరే ఆప్షన్ లేకుండా పోవడం.. అంతా సినీమాయే!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/