Begin typing your search above and press return to search.

సీటాడెల్ ఇండియ‌న్ వెర్ష‌న్ నుంచి స‌మంత ఔట్!

By:  Tupaki Desk   |   24 Dec 2022 7:05 AM GMT
సీటాడెల్ ఇండియ‌న్ వెర్ష‌న్ నుంచి స‌మంత ఔట్!
X
స‌మంతా అనారోగ్యం కారణంగా ఒక్కో ప్రాజెక్ట్ చేజార్చుకుంటుందా? మ‌రో నెల రోజుల్లో కోలుకోక‌పోతే మ‌రిన్ని ప్రాజెక్ట్ ల నుంచి ఉద్వాస‌న త‌ప్ప‌దా? అంటే అవున‌నే ప్ర‌చారం బాలీవుడ్ మీడియాలో జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి ఈ ర‌క‌మైన క‌థ‌నాలు ఇప్ప‌టికే వెలువ‌డ్డాయి. అయితే వాటిని స‌మంత స‌న్నిహిత వ‌ర్గాలు ఖండించాయి. కానీ తాజా స‌న్నివేశం మ‌రోలా క‌నిపిస్తుంది.

ఇటీవ‌లే స‌మంత న‌టించాల్సిన 'సీటాడెల్' ఇండియ‌న్ వెర్ష‌న్ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రార‌భ‌మైంది. ఈ విష‌యాన్నిఅమెజాన్ ప్రైమ్ ట్విట‌ర్లో ప్ర‌క‌టించింది. ఆ సంస్థ ఇచ్చిన జాబితాలోఎక్క‌డా స‌మంత పేరు క‌నిపించ‌లేదు. వాస్త‌వానికి ఇందులో వ‌రుణ్ ధావ‌న్కి జోడీగా స‌మంత న‌టించాలి. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న క్రేజీ వెబ్ సిరీస్ ఇది. అమ్మ‌డికి ఫ్యామిలీ మ్యాన్-2 త‌ర్వాత వ‌చ్చిన వెబ్ అవ‌కాశం కావ‌డంతో! ఎంతో సంతోషంగా సంత‌కం చేసింది.

కానీ తాజాగా అమెజాన్ ట్వీట్ చూసిన త‌ర్వాత ప్రాజెక్ట్ నుంచి ఆమె త‌ప్పుకుంద‌ని వార్త‌లొస్తున్నాయి. అనారోగ్యం కార‌ణంగా విశ్రాంతి తీసుకోవ‌డంతో ఆమె స్థానంలోమ‌రో హీరోయిన్ ని తీసుకుని ముందుకెళ్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. స‌మంత త‌ప్పుకుంద‌ని అధికారిక ప్ర‌క‌ట‌న లేన‌ప్ప‌టికీ స‌న్నివేశాలు అలాగే క‌నిపిస్తున్నాయి. ఈనేప‌థ్యంలో మ‌రో వార్త కూడా తెరపైకి వ‌స్తుంది.

బాలీవుడ్ లో స‌మంత న‌టించాల్సిన ఓ సినిమా నుంచి కూడా ఉద్వాస‌న ఎదురైన‌ట్లు స‌మాచారం. ఆ సినిమా షూటింగ్ జ‌న‌వ‌రిలో మొదలు పెట్ట‌డానికి రెడీ అవుతున్నారుట‌. ఈ నేప‌థ్యంలో స‌మంత ఇప్ప‌ట్లో త‌మ‌తో క‌ల‌వ‌డం క‌ష్ట‌మ‌ని భావించి స‌ద‌రు సంస్థ ఆమెని త‌ప్పించిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు స‌మంత కోసం నిర్మాత‌లంతా వెయిట్ చేస్తున్నార‌ని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు.

కానీ మీడియా క‌థ‌నాలు అందుకు భిన్నంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి సీటాడెల్ నుంచి త‌ప్పుకుందా? త‌ప్పించారా? అస‌లేం జ‌రుగుతోంది అన్న‌ది క్లారిటీ రావాలంటే స‌మంత లైన్లోకి రావాలి. జ‌న‌వ‌రి నుంచి 'ఖుషీ' షూటింగ్ కి హాజ‌ర‌వుతుంద‌ని మ‌రోవైపు జోరుగా ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.