Begin typing your search above and press return to search.

పిల్లల విషయంలోనూ సమంత పక్కా ప్లానింగ్

By:  Tupaki Desk   |   10 April 2018 4:57 PM GMT
పిల్లల విషయంలోనూ సమంత పక్కా ప్లానింగ్
X
గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ప్లానింగ్ తప్పనిసరి. అటు సినిమాలు.. ఇటు బ్రాండ్ ఎండార్స్ మెంట్లు.. మరోవైపు షాప్ ఓపెనింగ్స్.. ఇంకో వైపు ఫారిన్ టూర్లు.. పార్టీలు.. ఇన్విటేషన్లు.. ఫ్యామిలీ వ్యవహారాలు.. ఇన్నేసి అంశాలను డీల్ చేసేందుకు ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి. ఇక పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తున్న సమంత లాంటి వారికి అయితే.. ఈ ప్లానింగ్ ఇంకా చాలా ఇంపార్టెంట్.

అయినా.. ఎంత ప్లానింగ్ లేకపోతే చైతుతో మ్యారేజ్ తర్వాత కూడా సినిమాలను చేయడమే కాదు.. గ్లామర్ యాంగిల్ ను కూడా కంటిన్యూ చేయగలుగుతోందో అనిపిస్తుంది. అయితే.. ఇప్పుడీ భామ తను మరో విషయంలో కూడా ఫుల్లు ప్లానింగ్ తో ఉన్నానని.. ఇప్పటికే డేట్ అండ్ టైం కూడా ఫిక్స్ చేసేసుకున్నానని చెప్పింది. అదేంటో తెలుసా.. పిల్లల విషయంలో కూడా ముందే టైం ఇప్పటికే టైం ఫిక్స్ చేసేసుకుందట. ఎప్పుడు పిల్లలను కనాలి.. తను ఎప్పుడు అమ్మ అవాలి అనే విషయంలో ఫుల్లు క్లారిటీ ఉందని చెప్పింది సమంత.

తను ఓ చిన్నారికి జన్మనిచ్చిన తర్వాత మాత్రం.. ఆ బిడ్డకే అంకితం అయిపోవాలని ఫిక్స్ అయిందట సామ్. చిన్నతనంలో తానేమీ అంత గారాబంగా పెరగలేదని.. కానీ తన బిడ్డను మాత్రం అపురూపంగా చూసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పిన సమంత.. తాను అమ్మగా మారిన తర్వాత కొన్నేళ్ల పాటు ఆ బిడ్డను వదిలి ఎక్కడికీ వెళ్లే సమస్యే లేదని అంటోంది.