Begin typing your search above and press return to search.
వార్నీ సమంతా.. ఏంటా అవతారం
By: Tupaki Desk | 25 Oct 2015 4:06 AM GMTసుకుమారంగా కనిపిస్తూ.. సాఫ్ట్ క్యారెక్టర్లు చేస్తూ.. రొమాన్స్ పండిస్తూ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంటుంది సమంత. ఐతే ఆమె సడెన్ గా ఓ షాకింగ్ అవతారంలో కనిపించి అందరినీ భయపెడుతోంది. ఏ సినిమా కోసమో ఏంటో కానీ.. సమంత ఓ సరికొత్త అవతారంలో కనిపించబోతోంది. దానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది సమంత. రఫ్ లుక్ లో కనిపిస్తున్నా సామ్స్.. సిగరెట్టు తాగి -ఆ పొగను ముక్కుల్లోంచి వదులుతున్న ఫొటోల్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
నెగిటివ్ రోల్ లో కనిపించడం ఎంత ఫన్ గా ఉంటుందో ఎవరికి తెలుసు.. అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ కూడా జోడించింది సమంత. దీన్ని బట్టి ఏదో సినిమాలో సమంత నెగెటివ్ రోల్ చేస్తోందని అర్థమవుతోంది. మరి ఆ సినిమా ఏదో చూడాలి మరి. ప్రస్తుతం తెలుగులో బ్రహ్మోత్సవం - అ..ఆ సినిమాలు చేస్తున్న సమంత.. తమిళంలో ధనుష్ - సూర్యలతో సినిమాలు పూర్తి చేసింది. విజయ్ తో ఓ సినిమాలో నటిస్తోంది. మరి సమంత దమ్ము కొడుతూ దుమ్ము రేపుతున్న ఈ షాకింగ్ రోల్ చేస్తోంది ఏ సినిమాలోనో... ఆ క్యారెక్టర్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.