Begin typing your search above and press return to search.
వెంకీ కూతురిగా సమంత?!
By: Tupaki Desk | 14 Sep 2015 1:30 PM GMTఇమేజ్ ని పక్కనపెట్టి నటించే కథానాయకుడిగా వెంకటేష్ కి పేరుంది. `దృశ్యం` కోసం ఆయన ఒక మెట్టు కిందకి దిగి ఇద్దరమ్మాయిలకు తండ్రిగా నటించాడు. తన వయసుకు తగ్గ పాత్రలో వెంకీ నటించడంతో ప్రేక్షకులు కూడా ఆ సినిమాని విపరీతంగా ఆదరించారు. అక్కడ ఇమేజ్ కంటే రియాలిటీనే ఎక్కువగా చూశారు ప్రేక్షకులు. ఆ సినిమా ఇచ్చిన ప్రోత్సాహం వల్ల భవిష్యత్తులో వెంకీ మరిన్ని ప్రయోగాలు చేయాలని డిసైడైనట్టున్నాడు. త్వరలోనే ఆయన ఓ హీరోయిన్ కి తండ్రిగా నటించబోతున్నాడు. బాలీవుడ్ లో ఘన విజయం సాధించడంతో పాటు అక్కడ విమర్శకుల ప్రసంశలు కూడా అందుకొన్న చిత్రం `పీకూ`. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అక్కడ అమితాబ్ పోషించిన పాత్రలో ఇక్కడ వెంకీ నటించబోతున్నట్టు తెలుస్తోంది. వెంకీ కూతురుగా సమంత నటించనుందని టాక్.
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ `పీకూ` రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకొంది. దాన్ని టాలీవుడ్ లో అగ్ర కథానాయకులతో తీయాలని సురేష్ బాబు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ కథకు తగ్గట్టుగా, ఇమేజ్ ని వదిలి నటించే ఒకే ఒక్క కథానాయకుడు వెంకీ మాత్రమే కనిపించాడు. అందుకే ఆయనతోనే ఈ సినిమా తీయాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. వెంకీ కూడా అమితాబ్ పోషించిన పాత్రలో నటించేందుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. అమితాబ్ అక్కడ మలబద్దకంతో బాధపడే తండ్రిగా నటించాడు. అయితే ఆ పాత్రలో కాస్త మార్పులు చేసి వెంకటేష్ పై తెరకెక్కించబోతున్నారట.
అవకాశం వస్తే... గ్లామరస్ హీరోయిన్ తో డ్యూయెట్ లు పాడడానికే ఉత్సాహం చూపించే స్టార్ లున్న పరిశ్రమలో వైవిధ్యంగా ఆలోచించి ఓ హీరోయిన్ కి తండ్రిలా నటించడానికి ముందుకొచ్చిన వెంకీ కి నిజంగా అభినందనలు చెప్పాల్సిందే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇదివరకు వెంకటేష్ - రామ్ లపై `మసాలా` సినిమాని ఆయనే తీశాడు. ఆ చిత్రం అనుకొన్నంతగా ఆదరణ పొందకపోయినా ఇప్పుడు వెంకీ విజయభాస్కర్ కి మరో ఛాన్సిచ్చాడు. రీమేక్ లని బాగా డీల్ చేస్తాడని విజయ్ భాస్కర్ కి పేరుంది. మరి `పీకూ` రీమేక్ తోనైనా విజయం అందుకొంటారో లేదో చూడాలి.