Begin typing your search above and press return to search.

ఎవరితో అయినా ఫిట్ అయిపోతా -సమంత

By:  Tupaki Desk   |   7 Nov 2016 10:40 AM IST
ఎవరితో అయినా ఫిట్ అయిపోతా -సమంత
X
చైతులో లవ్ స్టోరీ.. త్వరలో పెళ్లి కారణంగా కొన్ని నెలల తర్వాత ఎలా పిలవాలో కానీ.. ఇప్పటిప్పుడు అయితే.. సమంత రూత్ ప్రభు అనడమే కరెక్ట్. సినిమాల విషయంలో కానీ.. లైఫ్ సంబంధిత డెసిషన్స్ లో కానీ తన స్టైల్ ను ఏ మాత్రం వదిలిపెట్టకుండా దూసుకుపోతోంది ఈ బ్యూటీ. అటు సినిమాల్లో టాప్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేయడమే కాదు.. ఇటు ఛారిటీ వర్క్స్ లోను అందరికంటే ముందు ఉండడంతో పాటు బెస్ట్ మార్కులు వేయించుకోగలగడం., సమంత స్టైల్.

మరి శామ్స ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటుంది? చిన్న పిల్లలతో అమ్మడి బిహేవియర్ ఎలా ఉంటుంది? లాంటి డౌట్స్ ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే వీటికి ఇప్పుడు పక్కా క్లారిటీ ఇచ్చేసిందీ బ్యూటీ. రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా.. ఓ ఫోటో చూపించి కొత్త సంగతలు చెబుతోంది సమంత. 'దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటయ్యా అంటే.. నేను ఏ ఏజ్ గ్రూప్ లో అయినా సెట్ అయిపోతా' అంటోంది సమంత.

ఇద్దరు చిన్నారులతో కలిసి సమంత ఆడుకుంటున్న ఫోటో చూస్తే.. సౌతిండియా టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు అంటే నమ్మడం చాలా కష్టమే. అంతంగా పిల్లల్లో పాపలా కలిసిపోయిందీ సమంత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/