Begin typing your search above and press return to search.

#సామ్.. సినిమాలు సినిమాలే వ్యాపారం వ్యాపార‌మే!

By:  Tupaki Desk   |   2 Nov 2021 7:26 AM GMT
#సామ్.. సినిమాలు సినిమాలే వ్యాపారం వ్యాపార‌మే!
X
స‌మంత ఓ వైపు విహార యాత్ర‌ల్లో ఉన్నా కెరీర్ ప్లానింగ్ లో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఇక‌ బిజీగా మార‌నుంది. ప్ర‌స్తుతం తెలుగు త‌మిళంతో పాటే హిందీ సినిమాల‌పైనా కాన్సంట్రేట్ చేస్తోంది. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన స‌మంత బాలీవుడ్ లోనూ సత్తా చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ నుంచి ముంబైకి మ‌కారం మార్చే ఆలోచ‌న చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అక్క‌డ సొంతంగా ఇల్లు తీసుకుని సినిమా ప్ర‌య‌త్నాల్లో బిజీ అవుతోంద‌నే గుస‌గుస వినిపిస్తోంది. భ‌విష్య‌త్ లో ముంబైలోనే స్థిర‌ప‌డాల‌ని ఆలోచ‌న చేస్తోంద‌ని క‌థ‌నాలు వ‌చ్చినా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ని బ్యాలెన్స్ చేయాల‌నేది త‌న ప్లాన్. ఇలా ప్రోఫెష‌న‌ల్ కెరీర్ లో ప‌క్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే స‌మంత మంచి బిజినెస్ ఉమెన్ గాను ప్రూవ్ చేసుకుంది. వివిధ ర‌కాల బిజినెస్ ల్లో స‌మంత రాణిస్తోంది. స్కూల్...క్లాథింగ్ బిజినెస్ ల‌ను హైద‌రాబాద్ లో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

ఆ వ్యాపారాల్ని ఇత‌ర సిటీల‌కు విస్త‌రించాల‌ని ప‌క్కా ప్లాన్ తో స‌మంత ముందుకెళుతోంది. నాగ‌చైత‌న్య‌తో విడాకులు అవ్వ‌డంతో భ‌విష్య‌త్ పై ఎలాంటి బెంగ లేకుండా అన్ని ర‌కాలుగా స్ట్రాంగ్ అవ్వ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాపారాల‌పై ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ద పెట్టిన‌ట్లు తెలుస్తోంది. `సాకీ వ‌ర‌ల్డ్` పేరుతో క్లాథింగ్ బిజినెస్ లోకి దిగిన స‌మంత ఆ బాధ్య‌త‌లు అన్నిటినీ రోహిణి కి అప్ప‌గించారు. ఇందులో బ‌ట్ట‌ల‌తో పాటు లేడీస్ కి సంబంధించిన ప్ర‌తీ క‌లెక్ష‌న్ యాక్స‌స‌రీస్ ని ఇక్క‌డ అందుబాటులోకి తీసుకొచ్చారు. స‌మంత తాజాగా ఆర్గ‌నైజ‌ర్ రోహిణితో బిజినెస్ వివ‌రాల్ని అడిగి తెలుసుకుంటోన్న ఓ వీడియోని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసారు.

నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత సోష‌ల్ మీడియాల్ని రెన్యువ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. పాత ఫోటోల‌ను తొల‌గించారు. ఇప్పుడు ఇన్ స్టాలో త‌నకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేయ‌డం ఇదే తొలిసారి. ఈ వీడియోలో స‌మంత ఎంతో యాక్టివ్ గా క‌నిపిస్తోంది. న‌వ్వుతూ...ఆర్గ‌నైజ‌ర్ రోహిణితో బిజినెస్ వివ‌రాల్ని అడిగి తెలుసుకుం టున్నారు. దీనిలో భాగంగా క్లాత్ షాప్ మొత్తాన్ని వీడియోలో షూట్ చేసి క‌వ‌ర్ చేసారు. మొత్తానికి స‌మంత లో మ‌ళ్లీ ఫ్రెష్ ఫీల్ క‌నిపిస్తోంది. మొన్న‌టివ‌ర‌కూ విచార‌క‌ర‌మైన పోస్టులు..సందేశాల్ని పోస్ట్ చేసిన స‌మంత తాజాగా ఎంతో స‌ర‌దాగా త‌న బిజినెస్ వ్య‌వ‌హారాల్లో చ‌లాకీత‌నం చూపిస్తూ క‌నిపించ‌డం విశేషం. #సామ్.. సినిమాలు సినిమాలే వ్యాపారం వ్యాపార‌మే! అన్న చందంగా దూసుకుపోతుండ‌డం గొప్ప రియ‌లైజేష‌న్ గా క‌నిపిస్తోంది.