Begin typing your search above and press return to search.
నా ఫ్యాన్స్ బుద్ధిమంతులన్న సమంత
By: Tupaki Desk | 9 Feb 2016 7:30 AM GMTసమంత ఏం మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా అందులో ఫ్యాన్స్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. అందరిలా కాకుండా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుందామె. అందుకే మీడియా కూడా తరచుగా సమంత దగ్గర ఫ్యాన్స్ ప్రస్తావన తీసుకొస్తుంటుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ గురించి రెండాకులు ఎక్కువే చెప్పింది. అందరి ఫ్యాన్స్‌లా కాదు నా ఫ్యాన్స్ , వాళ్లు చాలా బుద్ధిమంతులు అని కితాబుని కూడా ఇచ్చింది. ``నా కెరీర్ ఇలా ఉండటానికి కారణం నా అభిమానులే.
నేను ఏం చేసినా వాళ్లు ఫీడ్ బ్యాక్ ఇస్తుంటారు. వాళ్ల సలహాలు లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్నే కాదు. పైపెచ్చు నా ఫ్యాన్స్ అంతా కూడా ఏదో ఒక వృత్తిలో కొనసాగుతున్నవాళ్లే. ప్రొఫెషనల్స్ అయిన వాళ్లు ప్రతీ విషయంలోనూ బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. నాతోపాటు సోషల్ సర్వీస్ లోనూ పాల్గొంటుంటారు. అందుకే నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం`` అని చెప్పుకొచ్చింది సమంత. ఆమె హైదరాబాద్ లో ఓ గ్రూప్ నీ - చెన్నైలో ఓ గ్రూప్ ఫ్యాన్స్ నీ మెంటైన్ చేస్తోంది. సమంత కొత్తగా ఏం చేసినా వాళ్లకు సమాచారం ఇస్తూ అభిప్రాయాన్ని సేకరిస్తుంటుంది. నిజంగా అలాంటి ఫ్యాన్స్ నీ, స్నేహితుల్నీ మెంటైన్ చేసే కథానాయికలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సమంత తన ప్రాజెక్టుల విషయంలో చాలా హ్యాపీగా ఉంది. తెలుగుతోపాటు, తమిళంలోనూ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా కొనసాగుతోందామె.