Begin typing your search above and press return to search.

ఆ ట్యాలెంట్ నిత్యాకే ఉంది -సమంత

By:  Tupaki Desk   |   24 Oct 2015 3:53 AM GMT
ఆ ట్యాలెంట్ నిత్యాకే ఉంది -సమంత
X
ఇగో.. ట్యాలెంట్ ఉన్న చాలామంది హీరోయిన్లకు ఇది కూడా ఎప్పుడూ వెంటే ఉంటుంది. అయితే.. సమంత మాత్రం ఇందుకు భిన్నం. ఏదైనా సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తుంది. ఇబ్బంది పెట్టే ప్రశ్నలకైనా ఠక్కుమని ఆన్సర్ ఇచ్చేస్తుంది. అలాంటి శ్యామ్.. ఇప్పుడో తోటి హీరోయిన్ పై ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

"సినిమా ఇండస్ట్రీలో ట్యాలెంట్ - ఎనర్జీ - స్కిల్ ఉన్న ఓ హీరోయిన్ పేరు చెప్పండి. సమంత అని కాకుండా చెప్పాలి".. ఇదీ సమంతను ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్న. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు తామే అని నేరుగా చెప్పకపోయినా.. అందరూ కష్టపడతారంటూ తప్పించుకునే యత్నం చేస్తారు. లేదా సావిత్రి అనో, కన్నాంబ అనో చెప్పి కవరింగ్ ఇచ్చేస్తుంటారు.

ప్రశ్న స్ట్రయిట్ గా ఉంటే.. ఆన్సర్ ఇంకా ఘాటుగా వచ్చేసింది. ఎందుకంటే.. ఇక్కడ క్వశ్చన్ ఎదురైంది సమంతకి కదా. సింపుల్ గా "నిత్యామీనన్" అనేసింది శ్యామ్. తోటి హీరోయిన్, అందులోనూ పోటీ నిలిచే ప్రతిభావంతురాలైనా.. ఇంత నేరుగా ఒప్పేసుకోవడం సమంతకే చెల్లిందని చెప్పాలి. తమకు ట్యాలెంట్ ఉండబట్టే ఈ రేంజ్ లో ఉన్నామని చెప్పుకునే వాళ్ల మధ్య, మేం కనిపించినా వంద కోట్లు వస్తాయ్ అనే హీరోయిన్లున్న ఇలాంటి టైంలో.. తోటి హీరోయిన్ గొప్పదనాన్నిఓపెన్ గా ఒప్పుకున్నందుకైనా.. సమంతకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.