Begin typing your search above and press return to search.
'అ..ఆ' అనసూయ ఫిదా అయిపోయిన వేళ
By: Tupaki Desk | 30 July 2017 6:24 AM GMTఈ మధ్యకాలంలో తెలుగువారిని విపరీతంగా ఇంప్రెస్ చేసిన హీరోయిన్ల లిస్టులో.. అప్పట్లో వచ్చిన నిత్యా మీనన్.. ఆ తరువాత కీర్తి సురేష్ ఉంటారు. కాని ఈ ఇద్దరూ కూడా గ్లామర్ ను ఆస్వాదించే ప్రేక్షకులకు మాత్రం ప్రియులు కాలేకపోయారు. అదే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం అటు నటనను ఇష్టపడే ఆడియన్స్ కోసం బాగా యాక్టింగ్ చేస్తూ.. ఇటు గ్లామర్ ఆస్వాదించేవారి కోసం ఏకంగా బికినీల్లో కూడా కనిపిస్తూ.. ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు మన సమంతే. ఇప్పుడు సమంతకు మరో హీరోయిన్ పిచ్చపిచ్చగా నచ్చేసింది.
అ..ఆ సినిమాలోని తన నటనతో అనసూయ రామలింగం అనే క్యారెక్టర్ ను చిరస్మరణీయం చేసింది సమంత. అయితే అంతటి ఇంప్రెసివ్ రోల్ చేశాక ఈ అమ్మడు మళ్ళీ ఆ స్థాయి పాత్రలో తెలుగులో కనిపించలేదు కాని.. ఇప్పుడు అలాంటి ఒక కత్తిలాంటి రోల్ చేసిన భానుమతిని పొగిడేస్తోంది. అదేనండీ.. ఫిదా సినిమాలో భానుమతిగా ఆకట్టుకున్న సాయి పల్లవి నటనకు ఇప్పుడు సమంత కూడా ఫ్యాన్ అయిపోయిందట. ''ఈరోజు నుండి సాయి పల్లవి ఉందంటే నేను ఆ సినిమాకు వెళ్ళిపోతా. ఫిదా సినిమా చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. శేఖర్ కమ్ముల అండ్ వరుణ్ తేజ్.. కంగ్రాట్స్'' అంటూ ట్వీటేసింది సమంత.
ఈ మధ్యకాలంలో ఒక స్టార్ హీరోయిన్ ఇలా మరో హీరోయిన్ ను అకాశానికి ఎత్తేయడం అరుదే కాని.. ఇప్పుడు సమంత మాత్రం అలాంటి కామెంట్ల చేయడానికి అస్సలు వెనకాడట్లేదు. ఎందుకంటే అమ్మడు ఇప్పుడు ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ కాబట్టి.. ఖచ్చితంగా ఆ రేంజులోనే ఆమె బిహేవ్ చేస్తే బాగుంటుంది. అందుకు సమంతకు మనం నూటికి నూరు మార్కులు ఇవ్వాలి.