Begin typing your search above and press return to search.

ప్రేమ కోసం సమంత భలే చేస్తోందే

By:  Tupaki Desk   |   2 Sep 2017 8:25 AM GMT
ప్రేమ కోసం సమంత భలే చేస్తోందే
X
ప్రస్తుతం ఎంత పెద్ద సినిమా అయినా జనాల్లోకి వెళ్లాలంటే ప్రమోషన్స్ తప్పనిసరిగా చెయ్యాలనెలా ఫిక్స్ అవుతున్నారు సినిమావాళ్లు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యే యువతను ఆకర్షించడానికి తారలు కూడా సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకుంటున్నారు. సినిమాకు సంబందించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ సేసుకుంటూ.. కావాల్సినంత క్రేజ్ ను అందుకుంటున్నారు.

అయితే కొందరు తారలు సోషల్ మీడియాలో అంతా చురుగ్గా కనిపించరు. సినిమా కోసం ఎంత కష్టపడినా.. పబ్లిసిటీలో మాత్రం అంతగా ఎక్కువగా కష్టపడరు. అలాగే వారికి కూడా ఈ మీడియా అవగాహన అంత పెద్దగా ఉండదని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం సమంత మాత్రం తన సినిమాలకు సోషల్ మీడియా ద్వారా కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చుకుంటోంది. అంతే కాకుండా తనకు కాబోయే భర్త చైతు సినిమాలకు కూడా ఈ అమ్మడు తెగ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఎందుకంటే చైతు సోషల్ మీడియాలో కాస్త స్లోగానే ఉన్నాడట దీంతో తన ప్రేమికుడి పై బాధ్యతను తీసుకొని సమంత చైతు నటించిన యుద్ధం శరణం సినిమా ప్రమోషన్స్ బాగా నిర్వహిస్తోంది. ఏకంగా పిఆర్ గా అవతారం ఎత్తి చాలా బాద్యతగా ప్రమోషన్స్ ని చేస్తోంది. మరి సమంత ప్రమోషన్స్ చైతూకి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.

ఈ శుక్రవారం నాగ చైతన్య యుద్దం శరణం సినిమాతో ధియేటర్లకు వస్తున్న సంగతి తెలిసిందే. అది సంగతి.