Begin typing your search above and press return to search.
సామ్ కు అంత సీనుందా?
By: Tupaki Desk | 19 Sep 2018 4:15 AM GMTఅవును.. సామ్ కి అంత సీనుందా? సోలోగా బాక్సాఫీస్ ని చాకిరేవు పెట్టే దమ్ముందా? ప‌్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో వేడెక్కిస్తున్న హాట్ డిబేట్ ఇది. మహానటి- మధురవాణిగా - రంగస్థలం- రామలక్ష్మిగా రఫ్ఫాడించింది. తనలోని నటిని బయటకు తీసే సత్తా దర్శకులకు ఉండాలే కానీ..! అని నిరూపించింది. ఇప్పుడు ఏకంగా సోలో స్క్రిప్టులకు సై అనేస్తోంది. ఇన్నాళ్లు గ్లామరస్ రోల్స్ ని నమ్ముకున్న సామ్ ఇప్పుడు యుటర్న్ తీసుకుని స్క్రిప్టుల ఎంపికలో రూటు మార్చింది. హబ్బీ నాగచైతన్యకే పోటీకెళుతోంది.
మొన్నటికి మొన్న రిలీజైన యుటర్న్ లో జర్నలిస్టుగా మెప్పించింది. యుటర్న్ తెలుగులో హిట్టేనన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మునుముందు సమంత స్థాయి ఏంటి? అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. అనుష్క - నయనతార రేంజులో సోలోగా సినిమాని తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపించగలదా? హీరో కాని హీరో అవుతుందా? అంత డ్యాషింగ్ యాటిట్యూడ్ అక్కినేని కోడలులో ఉందా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. నయనతార - అనుష్క రేంజు చిన్నా చితకా కాదు. ఆ ఇద్దరి కరిష్మా వేరే. నయన్ రేంజు 100 కోట్లు. బాక్సాఫీస్ ని బంతాడేస్తుంది. ఇటు తెలుగు - అటు తమిళ్ రెండుచోట్లా నయన్ కి ఉన్న క్రేజు అసాధారణం. ఇక అనుష్క రేంజు అరుంధతితోనే -60కోట్లు - రీసెంటుగానే `భాగమతి` చిత్రంతో మరోసారి తన సత్తా ఎంతో చాటి చెప్పింది. బాక్సాఫీస్ వద్ద 60-80 కోట్ల గ్రాస్ తెచ్చే సత్తా తనకు ఉందని నిరూపించింది.
అందుకే ఇప్పుడు సామ్ పైనా బెట్టింగ్ నడుస్తోంది. దశాబ్ధంపై గానే టాలీవుడ్ ని ఏలిన సామ్ ఇప్పుడు యుటర్న్ తీసుకుంది కదా! అంటూ మాట్లాడుకుంటున్నారు. సామ్ నటించిన యూటర్న్ అంత తెస్తుందా? సామ్ కెపాసిటీ అంతుందా? అంటూ ముచ్చట సాగుతోంది. అంతేనా మరో అనుష్క శర్మ అనిపించుకుంటుందా? అంటూ బాలీవుడ్ నాయికతోనూ పోల్చి చూస్తున్నారు. స్క్రిప్టు మాత్రమే కథను నడిపిస్తున్న ఈ రోజుల్లో సమంత లాంటి స్టార్లు ఏం చేయడానికైనా ఆస్కారం ఉంది. ఇన్నాళ్లు హీరోసామ్యం రాజ్యమేలిన చోట నాయికా సామ్యానికి ఆస్కారం ఏర్పడింది. మరి అక్కినేని కోడలు పాత చరిత్రకు చెల్లుచీటీ ఇచ్చి - కొత్త హిస్టరీకి నాంది పలుకుతుందా? జస్ట్ వెయిట్ & వాచ్.