Begin typing your search above and press return to search.

స‌మంత వ‌చ్చేసిందిక‌.. గెట్‌ రెడీ..

By:  Tupaki Desk   |   11 Sept 2015 1:00 PM IST
స‌మంత వ‌చ్చేసిందిక‌.. గెట్‌ రెడీ..
X
టాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్లంతా దూర‌మైపోతున్నారు. న‌య‌న్‌, ఇలియానా లేనేలేరు. కాజ‌ల్ త‌మిళ ప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మైంది. త‌మ‌న్నా రేర్‌ గా క‌నిపిస్తోంది. ఇప్పుడు శ్రుతిహాస‌న్ కూడా కోలీవుడ్, బాలీవుడ్‌ కే అంకిత‌మైపోయింది. పోనీ స‌మంత ఏమైనా తెలుగులో న‌టిస్తోందా? అంటే అదీ లేదు. స‌రిగ్గా ఇదే సందు చూసి ర‌కూల్ ప్రీత్‌ సింగ్ క్రేజీ ప్రాజెక్టుల‌న్నీ త‌న ఖాతాలో వేసేసుకుంది. చ‌ర‌ణ్‌ - ఎన్టీఆర్‌ - బ‌న్నిల‌ను త‌న అకౌంట్ లో వేసేసుకుని ఇత‌ర తార‌ల్ని ద‌రి చేర‌నీయ‌లేదు.

అయితే ఎట్ట‌కేల‌కు ఈ భామ‌కు పోటీ ఇచ్చేందుకు స‌మంత తిరిగి వ‌స్తోంది. ఈ భామ కూడా మిగ‌తా భామ‌ల్లానే కోలీవుడ్‌ కి అంకిత‌మై తెలుగు సినిమాల్లో న‌టించ‌డం లేదు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత మ‌ళ్లీ స‌మంత జాడ టాలీవుడ్‌ లో క‌నిపించ‌నేలేదు. ఈ గ్యాప్ ని గ‌మ‌నించిన స‌మంత ఇప్పుడు ఫిల్ చేయ‌డానికి వ‌చ్చేస్తోంది. పంజాబీ బొమ్మ ర‌కూల్‌ కి పోటీ ఇస్తున్నా అంటూ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల‌తో రేసులోకి దూసుకొస్తోంది. ఒక‌టి మ‌హేష్ హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం, రెండోది త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ స‌ర‌స‌న అ .. ఆ. ఈ రెండు ప్రాజెక్టులు ఈ నెల‌లోనే ప్రారంభం అవుతున్నాయి. ఈ(రోజు)శుక్ర‌వారం బ్ర‌హ్మోత్స‌వం షూటింగ్ ప్రారంభ‌మ‌వుతోంది. ఇదే నెల‌లో త్రివిక్ర‌మ్, నితిన్‌ సినిమా కూడా ప్రారంభం కానుంది. అంటే స‌మంత మ‌రోసారి టాలీవుడ్‌ లో లైమ్‌ లైట్‌ లోకి వ‌చ్చేసిన‌ట్టే.

ఇక పోటీ ర‌కూల్‌, స‌మంత ఇద్ద‌రి మ‌ధ్య షురూ అయిన‌ట్టే. ర‌కూల్ ఇటీవ‌లి కాలంలో గోల్డెన్‌ లెగ్ అన్న పేరు తెచ్చుకుని ఆ ఇమేజ్‌ ని కాపాడుకుంటోంది. ఇప్పుడు మ‌రో గోల్డెన్‌ లెగ్ స‌మంత అడుగు పెట్టింది కాబ‌ట్టి హోరా హోరీ సీరియ‌స్‌ గానే సాగుతుంద‌న్న‌మాట‌. ఈ ఇద్ద‌రు భామ‌ల వ‌ల్ల మ‌న హీరోల‌కు, టాలీవుడ్‌ కి హిట్టు మీద హిట్టొస్తే మంచిదే క‌దా!