Begin typing your search above and press return to search.
సూట్ కేస్ సర్దేస్తున్న సమంత
By: Tupaki Desk | 14 March 2016 3:48 AM GMTకెరీర్ లో పీక్ టైం అంటే ఎలా ఉంటుందో.. బిజీ షెడ్యూల్ అంటే ఎలా ఉంటుందో.. హీరోయిన్స్ చాలా మందే చెప్పగలరు. కానీ ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు చేసి, అన్నిటినీ ఒకే టైంకి విడుదల ప్లాన్ చేస్తే.. ఆ టెన్షన్ ఎలా ఉంటుందో మాత్రం.. సమంత ఒక్కతే చెప్పగలదు. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ లేనంత బిజీగా కొన్ని నెలలుగా సమంత గడిపేస్తోంది.
తెలుగులో నితిన్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న అ..ఆ.. మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమాల్లో సమంత నటిస్తోంది. తమిళ్ లో విజయ్ తో తెరి - సూర్యతో 24 సినిమాలను రిలీజ్ కు రెడీ చేసింది. ఇవన్నీ సమ్మర్ లోనే వస్తున్నాయి. నెలలపాటు ఇంటికి కూడా వెళ్లకుండా వరుస షెడ్యూల్స్ తో వర్క్ కంప్లీట్ చేసిన సమంత.. ఇప్పుడు ఇంటికి చేరుకున్నానని ట్వీట్ చేసింది. 'మొత్తానికి ఇంటికి చేరాను. "మళ్లీ ఎక్కడికీ వెళ్లను, ఎవరూ నన్ను తీసుకెళ్లలేరు.(నెక్ట్స్ ట్రిప్ కి సూట్ కేస్ సర్దుకుంటూ)' అని ట్వీట్ చేసింది సమంత.
సమంత నటించిన రెండు తమిళ్ సినిమాలో ఏప్రిల్ లో రిలీజ్ ఉండడంతో.. చెన్నైలోనే ఉండి ప్రమోషన్స్ చేయనుంది ఈ భామ. ఆ తర్వాత.. తెలుగు చిత్రాల రిలీజ్ టైంకి ఇక్కడికొచ్చి పబ్లిసిటీ చేస్తుందన్న మాట. అదీ సమంత నెక్ట్స్ ప్లానింగ్.