Begin typing your search above and press return to search.
రాధారవి ఎపిసోడ్.. సమంతా ట్వీటు
By: Tupaki Desk | 26 March 2019 10:20 AM GMTరీసెంట్ గా ఒక ఫిల్మీ ఈవెంట్ లో సీనియర్ యాక్టర్ రాధారావి లేడీ సూపర్ స్టార్ నయనతారపై అభ్యంతరకరమైన కామెంట్లు చేయడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను డీఎంకే నుండి సస్పెండ్ చేశారు. ఈ ఎపిసోడ్లో చాలామంది నయనతారకు మద్దతుగా నిలుస్తూ రాధారవిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పలువురు తమిళ సెలబ్రిటీలు ఇప్పటికే రాధారవి కామెంట్స్ ను తప్పుబట్టారు. స్టార్ హీరోయిన్ సమంతా కూడా ఈ విషయంపై తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపింది.
'మీరో దారుణమైన మినిషి.. మిమ్మల్ని చూస్తే మాకు జాలిగా ఉంది. మీకు ఉన్న ఆత్మ.. ఒకవేళ అది మిగిలి ఉంటే దానికి శాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా. నయనతార నెక్స్ట్ సూపర్ హిట్ సినిమా టికెట్లను మీకు పంపిస్తాము. పాప్ కార్న్ తింటూ రిలాక్స్ అవ్వండి' అంటూ ట్వీట్ చేసింది. సమంతా చేసిన ఈ సెటైరికల్ ట్వీట్ కు చాలామంది నెటిజనులు మద్దతు తెలుపుతున్నారు. మహిళలపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యల చేసినప్పుడు సాటి హీరోయిన్లు ఇలా ముందుకొచ్చి వాటిని ఖండిస్తేనే రాధారవి లాంటివారిలో మార్పు వస్తుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే నిన్న రానాకూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'రాధారవి గారు.. మీకు సిగ్గుండాలి' అంటూ తీవ్రంగా విమర్శించాడు. నయనతారపై రాధారవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఎపిసోడ్ తర్వాతా మెల్లగా సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి మద్దతు పెరుగుతూ ఉండడం గమనించాల్సిన విషయం. డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఆ యూనియన్ నుండి చిన్మయిని లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో తొలగించిన విషయం తెలిసిందే. కోర్టు వారు చిన్మయికి మద్దతుగా తీర్పునిచ్చినా ఇంకా డబ్బింగ్ యూనియన్లోకి తీసుకోలేదు. దీంతో ఇప్పుడు చిన్మయి పట్ల అన్యాయం జరిగిందని.. రాధారవికి వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడడం మొదలు పెట్టారు.