Begin typing your search above and press return to search.
సామ్ ఫ్లోలో అనేసిందట
By: Tupaki Desk | 31 Jan 2019 11:09 AM GMTఅర్ధ శతదినోత్సవాలే గొప్ప అనుకుంటున్న ట్రెండ్ లో ఓ సెన్సిటివ్ లవ్ స్టోరీ 100 రోజులు ఆడటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఘనతను అందుకున్న అరుదైన చిత్రంగా గత ఏడాది తమిళ్ లో 96 నిలిచింది. దీని తెలుగు రీమేక్ దిల్ రాజు టేకప్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి-త్రిషలు అద్భుతంగా పండించిన పాత్రల్లో శర్వానంద్-త్రిషలు పరకాయ ప్రవేశం చేయబోతున్నారు. అయితే ఒరిజినల్ విడుదలైన సమయంలో ఈ సినిమా గురించి సామ్ అప్పట్లో కామెంట్ చేస్తూ ఇది ఎవరైనా రీమేక్ చేయడం కన్నా ఆ ఫీల్ ని అలాగే ఉండనివ్వడం బెటర్ అనేలా చెప్పింది.
సరిగ్గా ఈ మాటే దిల్ రాజు వద్ద ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది. సామ్ అప్పుడు తెలియక అలా అని ఉండవచ్చని అదే దర్శకుడు తీస్తున్నప్పుడు ఫీల్ లో తేడా జరగదని ఇది ముమ్మాటికీ మెప్పిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసాడు. అంతే కాదు తన బ్యానర్ లో రూపొందుతున్న మొట్టమొదటి రీమేక్ గా 96 మరో ప్రత్యేకతను కూడా సంతరించుకుందని చెప్పాడు. ఫస్ట్ కాపీ చేతికి వచ్చేదాకా దీని గురించి ఏమి మాట్లాడలేను అన్న దిల్ రాజు విడుదలకు ముందు సినిమా చూసిన వెంటనే ఇందులో మేజిక్ ని గుర్తించి దర్శకుడు ప్రేమ్ కుమార్ కు అడ్వాన్స్ ఇచ్చేశారట.
మార్చ్ నుంచి చిత్రీకరణ మొదలుపెడుతున్న ఈ మూవీ వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది. టెన్త్ క్లాస్ చదివే ఎపిసోడ్ కోసం యంగ్ శర్వాగా కనిపించే ఆర్టిస్ట్ వేటలో పడింది టీమ్. ఇంకో నెల టైం ఉంది కాబట్టి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ఆ లోపుగా పూర్తి చేయబోతున్నారు