Begin typing your search above and press return to search.

సమంత రియాక్షన్‌ : మాటల్‌ లేవ్‌.. నా మైండ్‌ పోయింది

By:  Tupaki Desk   |   27 Feb 2022 12:44 PM GMT
సమంత రియాక్షన్‌ : మాటల్‌ లేవ్‌.. నా మైండ్‌ పోయింది
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత ఈ మద్య కాలంలో రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరీ ముఖ్యంగా నాగ చైతన్య నుండి విడిపోయినట్లుగా సమంత ప్రకటించిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌ అయినట్లుగా అనిపిస్తుందని స్వయంగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదైనా ఆమె సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయిన విషయం మాత్రం నిజం.

సినిమాల గురించి.. ఇతర విషయాల గురించి ఎప్పటికప్పుడు తన వ్యూ ను అందరితో షేర్‌ చేసుకుంటూ ఉన్న సమంత తాజాగా ఆలియా భట్ నటించిన గంగూబాయ్ సినిమాకు సంబంధించిన రివ్యూ ఇచ్చింది. ఆ సినిమా పై సమంత ప్రశంసల వర్షం కురిపించింది. ఆలియా భట్ యొక్క అందం గురించి అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. సమంత ఆమె నటన గురించి ఈ సినిమాలో ఆమె చూపించిన ప్రతిభ గురించి పోస్ట్‌ పెట్టింది.

ఇన్ స్టా గ్రామ్‌ లో సమంత ఇంట్రెస్టింగ్‌ స్టోరీ పోస్ట్‌ చేసింది. అందులో ఆలియా భట్‌ ఫోటోను షేర్‌ చేయడంతో పాటు ఆ ఫోటో పై గంగూ బాయ్ ఒక మాస్టర్ పీస్‌. ఆలియా భట్‌ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు. ప్రతి ఒక్క డైలాగ్ కాని.. ఆమె ఎక్స్ ప్రెషన్‌ కాని నా మైండ్‌ పోయేలా చేసింది. అద్బుతమైన ఆలియా భట్‌ అంటూ సమంత నమస్తే ఈమోజీని షేర్‌ చేసి తనకు ఆలియా పై ఉన్న అభిమానంను చాటుకుంది.

ఒక స్టార్‌ హీరోయిన్‌ అయిన సమంత ఇలా మరో హీరోయిన్ గురించి స్పందించడం.. అది కూడా ఒక గొప్ప నటి అంటూ చిన్న అమ్మాయిలా స్పందించడం అంటే సాదారణ విషయం కాదు. సమంత మనసులో ఏమాత్రం కల్మషం లేని చిన్న అమ్మాయి అంటూ ఈ పోస్ట్‌ నిరూపిస్తుంది అంటూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

సమంత సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇటీవలే ఫస్ట్‌ లుక్ వచ్చి ఆకట్టుకుంది. ఇక తమిళంలో కాతువాకుల రెండు కాదల్‌ విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అందరిలో ఉంది. యశోద అనే ఒక భారీ పాన్ ఇండియా సినిమాను కూడా సమంత చేస్తున్న విషయం తెల్సిందే.

యశోద సినిమా కోసం ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ సెట్‌ ను దాదాపుగా అయిదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా సమంత నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సమంత ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకులకు చేరువయ్యింది. మరిన్ని వెబ్‌ సిరీస్‌ లు కూడా ఆమె చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.