Begin typing your search above and press return to search.

ఆరోజు ఉదయం 2.30 గంటలకే లేచాను : సమంత

By:  Tupaki Desk   |   8 April 2019 6:35 AM GMT
ఆరోజు ఉదయం 2.30 గంటలకే లేచాను : సమంత
X
తాజాగా విడుదలైన 'మజిలీ' చిత్రంకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కింది. అన్ని ఏరియాల నుండి మంచి ఓపెనింగ్స్‌ ను రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో చైతూ కెరీర్‌ లో బెస్ట్‌ ఓపెనింగ్స్‌ గా నిలిచింది. సమంత మరియు నాగచైతన్య కాంబో అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరి కాంబోలో మంచి సక్సెస్‌ సినిమాలు రావడంతో పాటు, పెళ్లి తర్వాత ఇద్దరి కలయికలో తెరకెక్కిన సినిమా అవ్వడంతో అందరు ఓ రేంజ్‌ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను అందుకునేలా ఈ చిత్రం నిలిచింది.

సినిమా సక్సెస్‌ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు థ్యాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ థ్యాంక్స్‌ మీట్‌ లో సమంత మాట్లాడుతూ సినిమాపై నమ్మకం ఉన్నా కూడా విడుదల రోజు తెల్లవారు జామున 2.30 గంటలకే నిద్రలేచాను. నిర్మాతల నుండి రిపోర్ట్‌ విన్నాను. పాజిటివ్‌ టాక్‌ వచ్చిందని నిర్మాతల నుండి తెలుసుకున్న తర్వాత గంట గంటలకు రిపోర్ట్‌ వచ్చింది. సినిమా ఫలితం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. అర్థ గంట పాటు నాకు కనీళ్లు ఆగలేదు.

సినిమా సక్సెస్‌ నేపథ్యంలో మామయ్య నాగార్జున ఇంటికి వచ్చి మరీ అభినందించారు. అది ఎప్పటికి మర్చి పోలేను. చైతూకు భార్యను అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమా ఎప్పటికి మర్చిపోలేని సినిమా అంది.

నాగచైతన్య మాట్లాడుతూ.. సినిమా అనుకున్నప్పటి నుండి కూడా దర్శకుడు నేను చాలా అండస్ట్రాండింగ్‌ మరియు ఒకరితో ఒకరం చర్చించుకుంటూ సినిమా చేశాం. మళ్లీ మళ్లీ శివతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మజిలీ అనేది తన కెరీర్‌ లోనే ప్రత్యేకమైన సినిమా అంటూ చెప్పుకొచ్చాడు.

బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా పోటీ లేని కారణంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ నమోదు అవ్వడంతో పాటు, లాంగ్‌ రన్‌ లో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. మొదటి వారం మొత్తం బాక్సాఫీస్‌ వద్ద మజిలీ జోరు కొనసాగబోతుంది. దాంతో తప్పకుండా లాంగ్‌ రన్‌ లో మంచి వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం.