Begin typing your search above and press return to search.
‘పెళ్లి డేట్’.. ‘హనీమూన్’ పై సమంత రియాక్షన్
By: Tupaki Desk | 17 July 2016 4:31 AM GMTలోకులు పలు కాకులు అంటారు చాలామంది. అందుకే ఎవరో ఏదో అనే మాటలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేస్తుంటారు సెలబ్రిటీలు చాలామంది. ఇక.. ప్రేమ.. పెళ్లి.. హనీమూన్ లాంటి వాటిపై ఎవరో ఏదో అంటే దానికి రియాక్ట్ అయ్యే సాహసం చేయరు ప్రముఖులెవ్వరూ. కానీ.. బ్యూటీ సమంత మాత్రం అందుకు భిన్నం. నాగచైతన్యతో ఆమె పెళ్లి మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిన వేళ.. ఆమె పెళ్లి డేట్ గురించి.. హనీమూన్ గురించి ఏదేదో రాసేసే వాళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటివి చదివి సోషల్ మీడియాలో వీటి గురించి చెప్పుకునేటోళ్లకు లెక్కే లేదు.
కానీ.. ఇలా మాట్లాడే వారు పెట్టిన కొన్ని ట్వీట్స్ కు సమంత రిప్లై ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. తన ట్విట్టర్ అకౌంట్లో.. తన ఫాలోయర్లు ప్రస్తావించిన పలు ట్వీట్స్ కు సమంత ఇచ్చిన సరదా సమాధానాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పర్సనల్స్ గురించి మాట్లాడితేనే మండిపడే సెలబ్రీటీలకు భిన్నంగా విషయాల్ని లైట్ తీసుకునే తత్వం ఉన్నట్లుగా తెలివిగా సమాధానాలు చెప్పిన ఈ చెన్నైబ్యూటీ ముచ్చట్లు ఆసక్తిని రేపేలా ఉన్నాయి.
చైతూతో ప్రేమ అన్న వార్తలకు కొనసాగింపుగా అతడితో పెళ్లి కన్ఫర్మ్ అయ్యిందన్న వార్త రావటం ఒక ఎత్తు అయితే.. ఆ పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యిందంటూ.. 2016 సెప్టెంబరు 23న ముహుర్తం పెట్టేశారంటూ పెట్టిన ట్వీట్ కు సమంత రియాక్ట్ అయి.. ‘‘ఎవరూ చెప్పలేదే’’ అని బదులిచ్చింది. ఆ మాత్రం రెస్పాన్స్ ఇస్తే.. మిగిలిన వారు ఊరుకుంటారా? ఇక.. ట్వీట్స్ చేయటం మొదలెట్టారు. వీటికి సమంత కూడా రియాక్ట్ కావటం గమనార్హం.
‘వెబ్ సైట్స్ హనీమూన్ షెడ్యూల్ కూడా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నాయి’ అంటూ అక్కసు వెళ్లగక్కుకున్న వ్యక్తి ట్వీట్ కి సమంత రియాక్ట్ అయి.. ‘మీకు నమస్కారాలు..’ అని బదులిచ్చింది. అన్నట్లు ఇప్పుడు మీ పిల్లలకు పేర్లు కూడా పెట్టేసినట్లున్నారంటూ ఎటకారం చేసిన ట్వీట్ కు బదులిస్తూ.. ‘‘నాకు సిగ్గస్తోంది బాబోయ్.. దీనికి నేనేం చెప్పాలి’’ అంటూ స్పందించింది.
హనీమూన్ కి వెళ్తారా?.. అన్న అర్థం వచ్చేలా మేక్ మై ట్రిప్ కూపన్స్ ఫ్రీగా ఇవ్వనా? అంటూ చేసిన ట్వీట్ కు.. ‘కింద పడి పడీపడీ నవ్వాలనిపిస్తోంది’ అంటూ లైట్ తీసుకుంది. పెళ్లి డేట్ అంటూ పోస్ట్ పట్టిన వ్యక్తిని ఉద్దేశిస్తూ.. ముహుర్తం చెప్పిన వ్యక్తి.. హనీమూన్ ఎక్కడో ఎందుకు చెప్పటం లేదో అంటూ ఆరా తీసిన ట్వీట్ కి బదులిచ్చిన సమంత.. ‘‘ఇవన్నీ స్టార్ట్ చేసింది మీరే. ఇప్పుడీ ట్వీట్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారా? అంటూ.. పారిస్ వెళ్దామనుకుంటున్నా? మీరేమంటారు? అంటూ ఎటకారం చేసింది. దీనికి అంతే కామెడీగా స్పందించిన మరొకరు ట్వీట్ చేస్తూ.. ‘యాక్షన్ ప్యాక్డ్ హనీమూన్ అయితే ఇస్తాంబుల్ వెళ్లండి’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి బదులిచ్చిన సమంత.. ‘టెమ్టింట్ గా ఉంది’ అని అంది. మ్యారేజ్ వెన్యూ పార్క్ హయత్ ఎందుకు కాకూడదు? అన్న ట్వీట్ కు స్పందించిన సమంత.. ‘‘వావ్.. ప్రతి ఒక్కరూ ఈ సంభాషణలో పాల్గొంటున్నారు’’ అని బదులిచ్చింది. ఈ ట్వీట్స్ చూసిన మరొకరు.. ‘ఈ సోది అంతా దేనికి ఏదో ఒకటి రివీల్ చేస్తే అయిపోతుందిగా డార్లింగ్’ అంటూ సరదాగా సిరాకు పడిపోయిన వ్యక్తికి అంతే సరదాగా.. ‘‘ఏదోఒకటి ఉండాలిగా డార్లింగ్’’ అంటూ బదులిచ్చేసింది. తన మీద ఇష్టారాజ్యంగా మాట్లాడేవారి విషయంలో అగ్గి ఫైర్ కాకుండా.. సరదాగా రియాక్ట్ కావటం సమంతకు మాత్రమే సాధ్యమేమో.