Begin typing your search above and press return to search.

పాత్ర నచ్చడంతో రాజీ పడ్డ సమంత!

By:  Tupaki Desk   |   25 Jun 2020 3:30 PM GMT
పాత్ర నచ్చడంతో రాజీ పడ్డ సమంత!
X
సమంత అక్కినేని పెళ్లి తర్వాత చేస్తున్న సినిమాలను చూస్తుంటే చాలా మెచ్యూరిటీతో కథలను ఎంపిక చేసుకుంటున్నట్లుగా క్లీయర్‌ గా అర్థం అవుతోంది. గతంలో మాదిరిగా పారితోషికం కోసం కమర్షియల్‌ పాత్రలకు ఒప్పుకోకుండా తనలోని నటిని సంతృప్తి పర్చుకునేందుకు పారితోషికంతో పని లేకుండా సినిమాలకు సమంత కమిట్‌ అవుతుంది. తాజాగా మరో సినిమాకు సమంత కమిట్‌ అయ్యింది.

గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఈ ఏడాదిలో సినిమాలు ఏమీ చేయడం లేదు.. విడుదలకు కూడా రెడీగా లేవు. ఇటీవలే ఈమె నయనతారతో కలిసి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కాని వైరస్‌ కారణంగా సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ ఏదీ లేదు. మళ్లీ ఇన్ని రోజులకు సినిమా గురించి మళ్లీ చర్చ మొదలైంది.

ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను ప్రారంభించేందుకు విఘ్నేష్‌ శివన్‌ సన్నాహాలు చేస్తున్నాడట. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను ఎక్కువ బడ్జెట్‌ తో తెరకెక్కించే పరిస్థితి లేదు. బడ్జెట్‌ విషయమై చర్చలు జరుగుతున్న సమయంలో సమంత తన పారితోషికం విషయంలో రాజీ పడి తగ్గించుకునేందుకు ఒప్పుకుందట. సమంత బడ్జెట్‌ తగ్గించుకోవడంతో సినిమా పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయ్యింది.