Begin typing your search above and press return to search.

స‌మంత హోట‌ల్‌ లో ఒప్పుకోలేద‌ట‌

By:  Tupaki Desk   |   18 Feb 2016 5:46 AM GMT
స‌మంత హోట‌ల్‌ లో ఒప్పుకోలేద‌ట‌
X
ఆ స‌న్నివేశం ఏంటో, ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ... ఇండ‌స్ట్రీలో మాత్రం హాట్ టాపిక్ అయింది. స‌మంత బాత్ రూమ్ స‌న్నివేశం అంటూ కొన్నాళ్లుగా చాలా చాలా మాట్లాడుకుంటున్నారు సినీ జ‌నాలు. మీడియాలోనూ దాని గురించి వార్త‌లొస్తున్నాయి. స‌మంత ప్ర‌స్తుతం నితిన్‌ తో క‌లిసి `అ..ఆ`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రొమాంటిక్ స‌న్నివేశాల్లో భాగంగా ఆ సినిమాలో స‌మంతని బాత్ రూమ్‌ లోకి దించేశాడ‌ట ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌. ఆ స‌న్నివేశాలు సినిమాకే హైలెట్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. అయితే వాటిని చిత్రీక‌రించే విష‌యంలో మాత్రం చాలా స‌మ‌స్య‌లొచ్చాయ‌ట‌. ఇలాంటి స‌న్నివేశాల్ని నేను హోట‌ల్ రూమ్‌ లో అయితే అస్స‌లు చేయ‌న‌ని స‌మంత చెప్పింద‌ట‌.

దీంతో చిత్ర‌బృందం చేసేదేం లేక స్టూడియోలోనే స‌ప‌రేట్‌ గా ఓ సెట్‌ ని వేయించి స‌న్నివేశాల్ని షూట్ చేశార‌ట‌. హోట‌ల్‌ లో ఆ స‌న్నివేశం చేయ‌డానికి స‌మంత‌కి స‌మ‌స్యేంటో అర్థం కాక నిర్మాత త‌ల ప‌ట్టుకొన్నాడ‌ట‌. అయినా ఎవ‌రి అభ్యంత‌రాలు వాళ్ల‌వి కాబ‌ట్టి త్రివిక్ర‌మ్ కూడా స‌మంత చెప్పిన‌ట్టుగానే ఆ స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేకంగా సెట్ వేయించిన‌ట్టు తెలిసింది. ఇదివ‌ర‌కు స‌మంత‌తో అత్తారింటికి దారేది సినిమాలోనూ బాత్ రూమ్ సీన్స్ షూట్ చేయించాడు త్రివిక్ర‌మ్‌. అయితే ఆ స‌న్నివేశాల్ని ఎడిటింగ్‌ లో తీసేశారు. సినిమా విడుద‌ల‌య్యాక ఆ క్లిప్స్ బ‌య‌టికొచ్చాయి. వాటిని చూసి కుర్రకారు భ‌లే ఇదిగా ఫీల్ అయ్యింది. మ‌రి `అ..ఆ`లోని కొత్త స‌న్నివేశాలు ఇంకెంత రంజుగా ఉంటాయో చూడాలి.