Begin typing your search above and press return to search.

మహానటి షూట్ లో సింపుల్ మహారాణి

By:  Tupaki Desk   |   19 March 2018 2:26 PM GMT
మహానటి షూట్ లో సింపుల్ మహారాణి
X
ఎవరు ఎన్ని చెప్పినా.. ఎంత మంది వచ్చినా టాలీవుడ్ కి మహారాణి అంటే సమంత అని ఒప్పుకోవాల్సిందే. డిఫరెంట్ క్యారెక్టర్స్ నుంచి గ్లామర్ పాత్రల వరకు.. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ తో సహా ఎలాంటి క్యారెక్టర్ అయినా ఇరగదీసేస్తుంది సమంత. పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ కంటిన్యూ చేస్తున్న సమంత.. ఇప్పుడు మహానటి మూవీ షూటింగ్ లో బిజీ బిజీగా ఉంది.

షాట్ గ్యాప్ లో రిలాక్స్ అవడం ఏ నటులకు అయినా మామూలే. మరి సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇలా విశ్రాంతి తీసుకోవాలి అంటే.. పెద్ద కార్వాన్ సిద్ధంగా ఉంటాయి. కానీ అలా చేస్తే.. ఆమె సామ్ ఎందుకు అవుతుంది? అందుకే ఎంచక్కా షూటింగ్ ప్లేస్ లోనే.. ఓ కుర్చీలో కూర్చుని మరో చైర్ లకి కాళ్లు బారచాపి సెటిల్ అయిపోయింది. గొడుగు పట్టుకుని బాయ్స్ కూర్చుంటే.. పక్కనే ఉన్న అసిస్టెంట్స్ ఏదో చెబుతుంటే.. ఏ చెవితో ఆలకిస్తూ చిరునవ్వుతో కూర్చుంది సమంత. ఆమె ఫేస్ లో కనిపిస్తున్న చిరునవ్వు చూస్తుంటే.. మహారాణి చిద్విలాసంగా నవ్వుతున్న ఫీలింగ్ కలగక మానదు.

మహానటి మూవీలో జర్నలిస్ట్ రోల్ చేస్తున్న సమంత.. ఇలా షాట్ గ్యాప్ లో మహారాణి మాదిరిగా ఓ పట్టీపట్టని కునుకు లాగించేస్తోంది. పక్కన ఉన్న వారి ఫేస్ ఫీలింగ్స్ ఓ సారి గమనించండి.. తమ రాణీగారికి నిద్రాభంగం కలగకుండా ఉండేలా ఎంత అలర్ట్ గా ఉన్నారో?