Begin typing your search above and press return to search.
ఆ మార్కులే అతి పెద్ద అవార్డు -సమంత
By: Tupaki Desk | 26 Feb 2016 7:30 AM GMTసమంత చేసిన నటించిన మొదటి సినిమా అక్కినేని నాగ చైతన్యతో కలిసి ఏ మాయ చేశావే. ఈ మూవీ మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో.. కమర్షియల్ గానూ అంత సక్సెస్ సాధించింది. అన్నిటికంటే మించి సమంత యాక్టింగ్ కి చాలామంది ఫిదా అయిపోయారు. ఆమెకు ప్రశంసలతో పాటు అనేక అవార్డులు కూడా బోలెడు వచ్చాయి. అయితే.. అన్నింటిలోకి అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసించడమే తాను అందుకున్న అతి పెద్ద అవార్డు, రివార్డు అంటోంది సమంత.
ఏ మాయ చేశావే చిత్రాన్ని చూసిన తరువాత.. ఏఎన్నార్ స్వయంగా ఫోన్ చేసి సమంతను, సమంత యాక్టింగ్ ని మెచ్చుకున్నారట. చాలా బాగా నటించావ్ అని పొగిడారట కూడా. ఈ సినిమాలో యాక్టింగ్ వరకూ నాగచైతన్యకు 49, నీకు 51 మార్కులు వేశా అన్నారట ఏఎన్నార్. అంత పెద్దాయన అలా ఫోన్ చేసి.. పొగడ్డంతో అదే పెద్ద అవార్డులా అనిపించిందట. అక్కినేని నాగేశ్వర్రావు నటించిన ఆఖరి చిత్రం 'మనం'లో కూడా ఆయనతో కలిసి నటించడం తన అదృష్టం అంటోంది శామ్స్.
అలాగే తాను స్టార్ హీరోయిన్ అయినా.. తనలోంచి ఓ కామన్ పర్సనాలిటీ తరచుగా బయటికొచ్చేస్తూ ఉంటుందట. హ్యాపీగా ఉండే డ్యాన్సులు వేసేయడం, బాధ కలిగితే కన్నీళ్లొచ్చేయడం లాంటివి కామన్ అని చెప్పింది సమంత. కంట్రోల్ చేసుకోమని ఫ్రెండ్స్ చెబుతున్నా మారలేకపోతున్నానని ఫీలయ్యింది కూడా.