Begin typing your search above and press return to search.
'ఏమాయ చేసావే' రోజుల్ని గుర్తు చేసుకున్న సమంత..!
By: Tupaki Desk | 27 Nov 2021 5:55 AM GMTదక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత రూత్ ప్రభు "అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్" అనే ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ చేయనున్న సంగతి తెలిసిందే. బాఫ్టా అవార్డ్ గ్రహీత ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సామ్ తో 'ఓ బేబీ' చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి.. గురు ఫిల్మ్స్ పతాకంపై ఈ ప్రాజెక్ట్ ని రూపొందించనున్నారు. తిమేరి ఎన్.మురారి రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని నిన్న శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సమంత.. ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు పేర్కొంది.
'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్-2 వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ సత్తా చాటిన సౌత్ స్టార్ సమంత.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ లో భాగం అవడంపై సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఇంటర్నేషనల్ మూవీలో అను అనే బై సెక్సువల్ తమిళ అమ్మాయిగా సామ్ నటిస్తుందని తెలుస్తోంది. 'సూపర్ డీలక్స్' 'ఫ్యామిలీ మ్యాన్ 2' తర్వాత ఆమె నటించే బోల్డ్ రోల్ ఇదే అవుతుంది. ఈ సినిమా కోసం సమంత ను ఆడిషన్ చేసి మరీ ఎంపిక చేశారట.
పన్నెండేళ్ల కిందట ‘ఏమాయ చేసావే’ కోసం ఇలా ఆడిషన్స్ లో పాల్గొన్నానని.. మళ్లీ ఇప్పుడు అదే పద్ధతిలోనే ఈ సినిమా కోసం ఎంపిక కావడం ఆనందంగా ఉందని సమంత చెప్పుకొచ్చారు. ''అను పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు దర్శకుడు ఫిలిప్ జాన్ కి నా కృతజ్ఞతలు. పూర్తిగా ఇదొక కొత్త ప్రపంచం. ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభించడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను'' అని సామ్ ట్వీట్ చేశారు.
అలానే ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా సంక్లిష్టమైన పాత్ర అని.. సవాలుతో కూడుకున్నది అని.. సెట్ లోకి వెళ్ళడానికి వేచి ఉండలేనని సమంత తెలిపింది. "అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్'' షూటింగ్ 2022 ఆగస్ట్ లో ప్రారంభం కానుంది. ఇకపోతే సమంత హాలీవుడ్ సినిమాకు ఎంపిక కావడంపై సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సమంత కూడా ఎగ్జైటెడ్ గా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తన ఆనందాన్ని పంచుకుంటోంది.
ఇకపోతే సమంత నటించిన 'కాతువాకుల రెండు కాదల్' చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. విడాకుల ప్రకటన తర్వాత ఆమె నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తున్న తొలి సినిమా ఇదే. ఇందులో నయనతార - విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. అలానే గుణశేఖర్ తో చేస్తున్న పాన్ ఇండియా 'శాకుంతలం' సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఇటీవల రెండు బైలింగ్వల్ చిత్రాలను ప్రకటించిన సామ్.. 'పుష్ప' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.