Begin typing your search above and press return to search.
ఆ చిత్రాలు చేయకుండా ఉండాల్సింది:సమంత
By: Tupaki Desk | 8 Sep 2018 8:47 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ‘యూటర్న్’ చిత్రంలో నటించింది. తెలుగుతో పాటు తమిళంలో ఈనెల 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సమంత చాలా ఆసక్తి పెట్టి ఈ చిత్రంలో నటించింది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం అవ్వడంతో సమంత తెలుగు మరియు తమిళంలో ఈమె స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది, గత రెండు మూడు వారాలుగా సమంత చెన్నై - హైదరాబాద్‌లో చెక్కర్లు కొడుతోంది. తాజాగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సమంత తన కెరీర్ ఆరంభంలో చేసిన తప్పిదాలను గుర్చి చెప్పుకొచ్చింది.
సమంత మాట్లాడుతూ.. హీరోయిన్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా ఛాన్స్ వచ్చింది, మొదటి సినిమాతోనే మంచి పేరు రావడంతో హీరోయిన్ గా కొనసాగాలని ఫిక్స్ అయ్యాను. నటిగా అవకాశం రాకముందు, అవకాశం వచ్చాక తాను ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం చేయలేదు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సూచనలతో మొదటి సినిమాలో నటించాను. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నేను చేసిన పాత్రలు - నా నటన చూస్తే నాకే చీ అనిపిస్తుంది. మరీ ఇంత దారుణంగా నటించాను ఏంటీ అనుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి.
కెరీర్ ఆరంభంలో ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలో తెలియదు - ఎలాంటి కథలు సక్సెస్ అవుతాయి - ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ఆధరణ పొందుతాయి - ఎటువంటి పాత్రల్లో నటిస్తే ఎప్పటికి ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు అనే విషయాలు తెలియని కారణంగా వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేశాను. ఇప్పుడు ఆ సినిమాల గురించి తల్చుకుంటే కొన్ని సినిమాలను చేయకుంటే బాగుండేదని, అసలు ఆ సినిమాలకు తాను ఎలా కమిట్ అయ్యానా అంటూ ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ సమంత చెప్పుకొచ్చింది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా ఇకపై నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తాను అంటూ సమంత చెబుతోంది. ‘యూటర్న్’ చిత్రం తర్వాత నాగచైతన్యతో కలిసి శివ నిర్వాన దర్శకత్వంలో ఒక చిత్రాన్ని సమంత చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత బన్నీతో కూడా ఈమె ఒక చిత్రం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.