Begin typing your search above and press return to search.
చెప్పుతో కొడతారు అనేశావేంటి స్యామ్?
By: Tupaki Desk | 3 Jun 2016 10:41 AM IST''ఆ మాట నేను చెబితే నన్ను చెప్పుతో కొడతారు. అవన్నీ నా హిట్లు ఎలా అవుతాయండీ? చెప్పడానికైనా అర్దం ఉండాలి'' అనేసింది సమంత. చాలా షాకింగ్ గా ఉంది కదూ. ఒక రకంగా సమంత చెప్పింది కూడా నిజమే.. ఎంతో మంది కష్టపడి ఒక సినిమాను హిట్టు చేస్తే.. ఆ క్రెడిట్ అంతా ఒక్కరి ఖాతాలో వేసేయడం కరెక్టు కాదుగా.
నిజానికి డిజాష్టరైనా కూడా ''బ్రహ్మోత్సవం'' సినిమా 1 మిలియన్ డాలర్లు అమెరిక్ కలక్షన్ సాధించిందంటే.. అది ఖచ్చితంగా మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అని వేరే చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాతో కలిపి మొత్తం 1 మిలియన్ కలక్షన్లు సాధించిన సినిమాలు హీరోయిన్ సమంత కెరియర్ లో తొమ్మిది సినిమాలు ఉన్నట్లు. ఇప్పుడు ''అ..ఆ'' కూడా 1 మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయితే.. ఆ కౌంట్ మొత్తం 10 అవుతుంది. మరి ''ఓవర్సీస్ క్వీన్'' అని పిలిపించుకుంటుంటే ఎలా ఉంది? అని అడిగితే.. అదిగో.. చెప్పుతో కొడతారు అంటూ స్ర్టయిట్ గా చెప్పేసింది స్యామ్.
నిజానికి ఎంత ఆనందం ఉన్నా కూడా.. ఆ 1 మిలియన్ క్రెడిట్ అంతా తనదే అనుకోవడం కాస్త కామెడీయే అవుతుంది. గ్రౌండ్ రియాల్టీలు బాగా తెలిసిన సమంత.. అందుకే అలా సమాధానం చెప్పింది. అంతే కాదు.. అమ్మడిని ఫెయిల్యూర్ లు చాలా కుదించేస్తాయ్ అని కూడా చెప్పుకొచ్చింది. అంటే 1 మిలియన్ డాలర్లు వచ్చిన సినిమాల్లో కొన్ని కమర్షియల్ హిట్లు కాదు కదా.. అందుకే అలా చెప్పిందనమాట.