Begin typing your search above and press return to search.

బికినీ కామెంట్లకు సమంత కౌంటర్

By:  Tupaki Desk   |   10 Feb 2018 12:39 PM IST
బికినీ కామెంట్లకు సమంత కౌంటర్
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ - అక్కినేని వారి కోడలు సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రవరిస్తోన్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మొదట్లో వచ్చినప్పుడు అమ్మడు ఎంత సింపుల్ గా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సినిమాల ప్రభావం వల్ల గ్లామర్ టచ్ ని తాకక తప్పలేదు. కానీ పెళ్లి తరువాత ఎవరైనా సరే కొంచెం అయినా లిమిట్ లో ఉంటారు. కానీ సమంత మాత్రం ఆ లిమిట్ ను దాటడమే కాకుండా ఇంకా డోస్ పెంచేసింది.

ఆమె కెరీర్ లో ఎప్పుడు లేనంతగా రీసెంట్ గా ఒక బికినీ ఫొటో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఒక ఉయ్యాలపై సేద తీరుతూ ఆమె స్టిల్ ఇచ్చిన ఆ ఫొటో ని కొందరు పొగిడినప్పటికీ.. మరికొందరు మాత్రం చురకలంటిస్తున్నారు. ఎన్నో రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. ఇన్ని రోజులు నీకు అభిమానిగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నా అని ఘాటైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

అయితే అంత ఘాటైన కామెంట్స్ వస్తే అమ్మడికి కనిపించకుండా ఎలా ఉంటుంది. వెంటనే.. ఆ విషయంపై స్పందించింది. ధృడ చిత్తం గల మ‌హిళ‌...స్త్రీ ఏం చేయ‌గ‌ల‌దో తనకు తాను నిర్ణయం తీసుకోగలదు. ఇతరులు ఆ విషయంలో కలుగజేసుకోకూడదు అనేలా కొటేషన్ ఇచ్చింది. అంటే ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. ఎవరు చెప్పనవసరం లేదని అమ్మడు తేల్చి చెప్పినట్లు ఉంది కదా!