Begin typing your search above and press return to search.
ఒక్క ట్వీట్ తో అందరికీ జవాబిచ్చిన సామ్?
By: Tupaki Desk | 29 Aug 2021 8:25 AM GMTగత కొద్దిరోజులుగా అక్కినేని కాంపౌండ్ పై రకరకాల గుసగుసలు అభిమానుల్లో హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య - సమంత జంట మధ్య ఏవో కలతలు ఉన్నాయని ఆ ఇద్దరూ విడిపోతున్నారని రూమర్స్ వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టే సామ్ తన సోషల్ మీడియాల్లో అక్కినేని అన్న ట్యాగ్ లైన్ ని తొలగించి `S` అనే సింగిల్ అక్షరాన్ని ఉంచడం లోన్ లీ నెస్ ని ప్రకటించడం అలాగే తనదైన ఇండివిడ్యువాలిటీ గురించి ప్రస్థావించడం వగైరా వగైరా పరిణామాలు చూశాక చాలా రకాల సందేహాలకు తావిచ్చింది.
సందేహాలు వ్యక్తమవుతున్నా.. రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నా .. దేనికీ అక్కినేని కాంపౌండ్ కానీ సమంత సన్నిహితుల నుంచి కానీ స్పందనలు లేవు. రూమర్స్ కి నేరుగా చెక్ పెట్టకపోవడం అదనపు డౌట్స్ పుట్టిస్తోంది. అయితే అన్నిటికీ చెక్ పెట్టేందుకా అన్నట్టుగా సమంత తాజాగా ఒక్క ట్వీట్ తో ఆన్సర్ ఇచ్చారు.
నేడు మామగారు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సమంత తాజా ట్వీట్ అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది. నేటి ఉదయం సామ్ తన ట్విట్టర్ లో మామ గారిపై గౌరవం ప్రదర్శించడమే గాక.. ప్రేమాభిమానాల్ని వ్యక్తం చేశారు. ``మీపై నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు. ఎల్లప్పుడూ మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు`` అని తెలిపారు.
నాగ చైతన్య - సమంతల నడుమ సంబంధాలు దెబ్బ తిన్నాయని నమ్ముతున్న అందరికీ ఇది బిగ్ పంచ్ అనే చెప్పాలి. అవన్నీ కట్టుకథలు.. కేవలం పుకార్లు మాత్రమేనని అభిమానులు భావిస్తున్నారు. నిజానికి చైతన్య - సమంత మధ్య ప్రేమకథ ఎంతో అద్భుతమైనది. ఈ జంట ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దల్ని ఒప్పించి పెళ్లాడారు. 2017 లో గోవాలో డెస్టినేషన్ తరహాలో వివాహం చేసుకున్నారు. చై- సామ్ జాయ్ ఫుల్ లైఫ్ కి సంబంధించిన ప్రతి ఫోటో వీడియో అభిమానుల్లో వైరల్ అయ్యాయి. ఈ నెల ప్రారంభంలో సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుండి అక్కినేనిని తొలగించడం విడాకుల పుకార్లకు దారితీసింది. కానీ అది నిజం కాదని సమంత అభిమానులు నమ్ముతున్నారు. తాజా ట్వీట్ తో సమంత గట్టి ఆన్సర్ ఇచ్చినట్టేనని భావిస్తున్నారు.