Begin typing your search above and press return to search.

స‌మంత ఇబ్బంది ప‌డుతోందా?!

By:  Tupaki Desk   |   6 Aug 2015 7:55 AM GMT
స‌మంత ఇబ్బంది ప‌డుతోందా?!
X
సినిమా ఇండ‌స్ట్రీ లో గాసిప్స్ మామూలే. ఎక్కువ‌గా లైమ్ లైట్‌ లో ఉన్న స్టార్స్‌ పైనే గాసిప్స్ వ‌స్తుంటాయి. అందుకే గాసిప్స్ వ‌చ్చాయంటే చాలామంది `మా హోదా పెరిగిపోయిందేమో` అని సంతోషిస్తుంటారు. అయితే ఆ గాసిప్స్‌ లో అప్పుడ‌ప్పుడు కొన్ని నిజాలవుతుంటాయి కూడా! త‌మ‌పై వ‌చ్చిన కొన్ని గాసిప్స్ విని స్టార్స్ కూడా స‌ర‌దాగా న‌వ్వుకొంటుంటారు. కొన్ని మాత్రం వాళ్ల‌ని చాలా హ‌ర్ట్ చేస్తుంటాయి. అలాంటి సంద‌ర్భాల్లో నేరుగా రంగంలోకి దిగి `అది కాదు, ఇది నిజం` అని క్లారిఫై చేస్తుంటారు. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ అందుబాటులోకి వ‌చ్చింది కాబ‌ట్టి స్టార్స్ వాటి ద్వారానే త‌మ ఆవేద‌న‌ని వెళ్ల‌గ‌క్కుతుంటారు. ఆమ‌ధ్య ర‌కుల్‌ ప్రీత్‌ సింగ్ త‌నకంటే సీనియ‌ర్ల‌యిన కొద్దిమంది హీరోయిన్ల‌ పై కామెంట్లు చేసింద‌ని వ‌చ్చిన వార్త‌ల్ని తోసిపుచ్చుతూ ట్విట్ట‌ర్ ద్వారా ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకొంది. ఇప్పుడు స‌మంత కూడా అదే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇంత‌కీ స‌మంతపై వ‌చ్చిన గాసిప్స్ ఏంటంటారా? అవి స‌మంత‌కి మాత్ర‌మే తెలుసు. నిజానికి స‌మంత‌ పై గాసిప్స్ కొత్తేమీ కాదు. ఇదివ‌ర‌కు సిద్ధార్థ్‌ తో స‌న్నిహితంగా మెలుగుతోంద‌ని ప‌రిశ్ర‌మ కోడై కూసింది. వాటిపై స‌మంత ప‌లుమార్లు క్లారిటీ ఇచ్చింది. ఇటీవ‌ల మాత్రం ప్రేమ‌ కి గుడ్ బై చెప్పేశాన‌ని చెబుతుంటుంది. అయినా స‌రే ఆమెని గాసిప్స్ మాత్రం వెంటాడుతున్నాయి. ఇటీవ‌ల కొత్త‌గా ఒక‌రితో స‌న్నిహితంగా మెలుగుతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆ గాసిప్ విష‌యంలోనే స‌మంత ఇబ్బంది ప‌డుతోంద‌ని స‌మాచారం. అది నిజ‌మేన‌ని నిరూపించేలా స‌మంత ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌ లో కొన్ని వ్యాఖ్య‌లు చేసింది. ``వార్త‌లు ప్ర‌జ‌లు ఏం చేశారో చెబితే... గాసిప్స్ మాత్రం రాసిన‌వాళ్లు ఎంత ఎంజాయ్ చేశారో చెబుతుంటాయి`` అని ట్వీటింది. దీన్నిబ‌ట్టి కొన్ని గాసిప్స్ స‌మంత‌ని వ్య‌క్తిగ‌తంగా ఇర‌కాటంలో పెట్టేస్తున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. భ‌విష్య‌త్తులో ఎక్క‌డైనా ప్రెస్‌ మీట్ల‌ లో పాల్గొంటే మాత్రం స‌మంత ఆ విష‌యంపై సుదీర్ఘంగా స‌మాధానం చెప్పేలా క‌నిపిస్తోంది. ఎందుకంటే స‌మంత మ‌న‌సులో ఏదీ దాచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌దు.