Begin typing your search above and press return to search.

సమంత గట్టిగానే తిప్పికొట్టింది

By:  Tupaki Desk   |   15 July 2016 10:35 AM IST
సమంత గట్టిగానే తిప్పికొట్టింది
X
ధనుష్ హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘వాడా చెన్నై’ నుంచి సమంత తప్పుకుని కొన్ని రోజులు కూడా కాలేదు. ఇంతలోనే నాగచైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించబోయే సినిమాకు కూడా ఆమె టాటా చెప్పేసినట్లు.. రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. చైతూ పెళ్లి నేపథ్యంలో సమంత ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేయాలని డిసైడైపోయినట్లుగా సంకేతాలిస్తున్నాయి ఈ పరిణామాలు. జనతా గ్యారేజే సమంత చివరి సినిమా అని కూడా ప్రచారం మొదలైపోయింది.

ఐతే తన గురించి వస్తున్న రూమర్ల గురించి ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా సమంత క్లారిటీ ఇచ్చేసింది. జనతా గ్యారేజే మీ చివరి చిత్రమటగా అని ఓ అభిమాని అడిగితే.. ‘‘అది కచ్చితంగా రూమరే. నాకు సుదీర్ఘ కాలం సినిమాల్లో కొనసాగాలని ఉంది. కొనసాగుతాను’’ అని సమంత స్పష్టం చేసింది. ఇంతకీ డిసెంబర్ లో మీ పెళ్లి అంటున్నారు నిజమేనా అంటే.. అది కూడా రూమరే అని తేల్చేసింది. ఐతే చైతూతో ప్రేమాయణానికి సంబంధించిన ప్రశ్నల్ని మాత్రం ఆమె పూర్తిగా అవాయిడ్ చేసేసింది.

ఇంకా ఈ చిట్ చాట్ లో సమంత కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు జవాబిచ్చింది. రాజమౌళి.. తమిళ దర్శకుడు బాల.. వీళ్లిద్దరి నుంచి ఒకేసారి ఆఫర్ వస్తే ఎవరి సినిమాల్లో నటిస్తారంటే ‘రాజమౌళి’ అంటూ ఠకీమని బదులిచ్చింది సామ్. ఎప్పుడైనా చచ్చిపోవాలన్న ఫీలింగ్ కలిగిందా అంటే.. కొన్నిసార్లు అలాంటి ఆలోచనలు కలిగాయని.. కఠిన పరిస్థితులు ఎదురయ్యాయని.. ఐతే ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితుల్ని అధిగమించానని సమంత చెప్పింది.