Begin typing your search above and press return to search.
ఔను ఆదివారం తింటా.. విమర్శలపై సమంత
By: Tupaki Desk | 13 March 2019 11:39 AM GMTసోషల్ మీడియా పరిధి పెరిగిన నేపథ్యంలో ప్రతి చిన్న విషయాలకు, పెద్ద విషయాలకు, సంబంధం ఉన్న విషయాలకు, లేని విషయాలకు కొందరు జనాలు ట్రోల్స్ చేయడం కామన్ అయ్యింది. బాలీవుడ్ ప్రముఖ నటీనటులు, ఇండియాస్ట్ టాప్ క్రీడాకారులకు కూడా ఏదో ఒక సమయంలో విమర్శలు తప్పలేదు. ముఖ్యంగా వారు వారు ప్రమోట్ చేస్తున్న బ్రాండ్స్ విషయంలో సదరు సెలబ్రెటీలు తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా సమంత కుర్ కురే బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపిక అయ్యింది. సమంత కుర్ కురే తింటున్న ఫొటోను షేర్ చేసి, తాను కుర్ కురేకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసింది.
అప్పటి నుండి సమంతపై ట్రోల్స్ మొదలయ్యాయి. మీరు హెల్త్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, జనాలు మాత్రం ఏవి పడితే అవి తినాలి. మీరు ప్రమోట్ చేస్తున్న కుర్ కురే ప్యాకెట్ ను మీరు తింటారా, అందులో ఉన్న మొత్తం స్నాక్స్ ను తింటారా అంటూ సోషల్ మీడియాలో చాలా మంది సమంతను ప్రశ్నించారు. పిల్లలను అనారోగ్యంకు గురి చేసే కుర్ కురేను మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు. ఏదో తింటున్నట్లుగా నటించి, కెమెరా ముందు కనిపించి డబ్బులు తీసుకుంటారు తప్ప మీరు మీ ఆరోగ్యంను వదిలేసి కుర్ కురేలను తింటారా అంటూ సమంతను రకరకాలుగా ట్రోలింగ్ చేయడంతో స్వయంగా సమంత సమాధానం ఇచ్చింది.
సమంత స్పందిస్తూ... నేను కుర్ కురే తింటాను, నాకు ఇష్టం కనుకే ప్రమోట్ చేసేందుకు ఒప్పుకున్నాను. షూటింగ్స్ లేని ఆది వారాల్లో నేను టైం పాస్ కోసం తీసుకునే ఫుడ్స్ ఫొటోలు మీకు చూపిస్తాను. అందులో కుర్ కురే తప్పకుండా ఉంటుంది. నేను ఎక్కువగా డైట్ ఫాలో అయినా కూడా బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా తీసుకునే స్నాక్స్ మాత్రం కుర్ కురేనే అంటూ సమాధానం చెప్పింది. సమంత విమర్శలకు ఇచ్చిన సమాధానంతో అయినా ట్రోలింగ్ ఆగుతుందేమో చూడాలి.