Begin typing your search above and press return to search.

శామ్స్ ఆ సీక్రెట్ చెప్పేసిందోచ్

By:  Tupaki Desk   |   14 Jun 2016 11:22 AM IST
శామ్స్ ఆ సీక్రెట్ చెప్పేసిందోచ్
X
అందానికి అ..ఆ..లు నేర్పించినట్లుగా ఉంటుంది సౌత్ సుందరి సమంత రూపం. కెరీర్ లో తనపై విమర్శలు వచ్చిన ప్రతీసారీ అద్భుతమైన కేరక్టర్ - కేరక్టరైజేషన్ తో సమాధానం ఇవ్వడం శామ్స్ కి అలవాటయిపోయింది. పర్సనల్ రిలేషన్స్ ప్రభావం చూపుతున్నా.. కెరీర్ ని ఏ మాత్రం స్లో కాకుండా జాగ్రత్త పడ్డం ఈ భామ స్పెషాలిటీ. ప్రతీ సినిమాకి తనలో ఆకర్షణ పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్న సమంత.. తన బ్యూటీ సీక్రెట్ ని విప్పేసింది.

ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మధ్యలో ఒకట్రెండు సినిమాల్లో సమంత అందం తగ్గినట్లుగా అనిపిస్తుంది కానీ.. ఇప్పటికీ అదే మెరుపు - అదే నునుపుతో తళతళలాడ్డం శామ్స్ ప్రత్యేకత. ఇలా తన అందాన్ని మెయింటెయిన్ చేయడానికి.. తాను పాటించే సీక్రెట్ ఫిట్నెస్ అని సమంత అంటోంది. 'ఫిట్నెస్ కోసం ఒక్కొక్కరిదీ ఒక్కోదారి. కొందరు యోగా అంటారు.. మరికొందరు ఏవేవే ట్రీట్మెంట్లు చేయించుకుంటారు.. ఇంకొందరు జిమ్ చేస్తారు.. నేను ఈ చివరి కేటగిరీలో ఉంటాను' అంటోంది సమంత.

'నేను వారంలో ఐదు రోజుల పాటు తప్పనిసరిగా జిమ్ చేయాల్సిందే. హైద్రాబాద్ లో ఉన్నా.. చెన్నైలో ఉన్నా.. ఎక్కడున్నాసరే జిమ్ మాత్రం మానను' అని తేల్చేసింది శామ్స్. ఫిట్నెస్ అండ్ బ్యూటీ విషయంలో అమ్మడు ఫాలో అయిపోతున్న సీక్రెట్ అదన్న మాట.