Begin typing your search above and press return to search.

సమంతాను అలా చూడగలమా

By:  Tupaki Desk   |   25 Jan 2018 9:30 AM GMT
సమంతాను అలా చూడగలమా
X
నిన్న విడుదలైన టీజర్ తో రంగస్థలం హడావిడి మొదలైపోయింది. రెస్పాన్స్ తో మెగా ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉండగా ఒక్క రామ్ చరణ్ పాత్రను తప్ప ఇంకెవరిని రివీల్ చేయకపోవడంతో ట్రైలర్ కోసం ఎదురు చూపులు స్టార్ట్ అయిపోయాయి. సమంతా ఫాన్స్ మాత్రం తనని ఇందులో చూపనందుకు హర్ట్ అయిపోయి టీజర్ స్క్రీన్ షాట్స్ తీసి అందులో సమంతాను ఫోటో షాప్ లో మిక్స్ చేసి మరీ పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముందు నుంచి లీక్ అవుతున్న న్యూస్ ని బట్టి రామ్ చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడు అనే వార్త ఎట్టకేలకు నిజమయ్యింది. సౌండ్ ఇంజనీర్ చిట్టి బాబు పాత్రలో ఇందులో తనకు చెవుడు అని రామ్ చరణ్ పాత్రతో స్వయంగా చెప్పించేసి దాన్ని నిజం చేసేసారు. ఇప్పుడు ఇంతకుముందే ప్రచారంలో ఉన్న మరో వార్త కూడా చర్చల్లోకి వచ్చింది.

రామ్ చరణ్ పాత్రకు ఒక వైకల్యం ఉన్నట్టే సమంతా పాత్రకు కూడా మాటలు రాకపోవడం అనే వైకల్యం ఉంటుందట. ఇప్పుడు ఇది కూడా నిజమే అవుతుందా అనే అంచనాలు మొదలయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది నిజమవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. మాటలు రాని సమంతాతో వినపడని రామ్ చరణ్ మధ్య ఊహకు అందని అద్భుతమైన లవ్ ట్రాక్ ని సుకుమార్ సెట్ చేసాడని, ఇది చూసాక ఇద్దరు అలా ఉండటమే కరెక్ట్ అని ప్రేక్షకులు సైతం ఫీల్ అయ్యేలా కథనం రాసుకున్నాడట సుకుమార్.

ఇది నిజమే అయితే సంతోషమే. కొత్త తరహా పాత్రల్లో సమంతా - చరణ్ లను ఒకేసారి చూసుకోవచ్చు. కాని గమ్మత్తైన చిన్మయి డబ్బింగ్ తో కితకితలు పెడుతూ గలగలా మాట్లాడే సమంతాను సైలెంట్ గా చూడటం అంటే ఇబ్బంది కలిగించే విషయమే. ఒకవేళ స్టొరీ ప్రకారం ఆ ఇద్దరు మామూలు కావడం లాంటి ట్విస్ట్ సుక్కు ఏదైనా పెట్టినా ఆశ్చర్యం లేదు. పూజా హెగ్డే తో తీయబోయే ఐటెం సాంగ్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానున్న రంగస్థలం మార్చ్ 30 విడుదల చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది.