Begin typing your search above and press return to search.
మామ సినిమాలో నానితో సమంత?
By: Tupaki Desk | 16 Feb 2018 11:14 AM GMTఈగ సినిమాలో నాని సమంత తో కలిసి కొంచెం సేపే కనిపించినా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో ఆ తరువాత వెంటనే ఆ జోడీని ప్రేమ కథల దర్శకుడు గౌతమ్ మీనన్ తెరపై చాలా సేపు చూపించాడు. ఆ సినిమాలో ఇద్దరి మధ్య రొమాన్స్ స్ట్రాంగ్ గా క్లిక్ అయ్యింది. అయితే సినిమా మాత్రం అనుకున్నంత రెంజ్ లో హిట్ అవ్వలేదు. ఆ సినిమాలోని వారిద్దరి నటన చాలా ముచ్చటగా ఉందని చాలా మంది ప్రశంసించారు.
ఇకపోతే మళ్లీ ఆ జంట ఆ మధ్యలో ఒకసారి మళ్లీ కలవబోతోందని వార్తలు వచ్చాయి. కానీ నాని వరుసగా ఎన్ని సినిమాలు చేసిన సమంత కనిపించలేదు. రెమ్యునరేషన్ వల్ల ఆమెను నాని నటించిన సినిమాలో తీసుకోలేదని కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. బడ్జెట్ దృష్ట్యా హీరోయిన్ ను మార్చాల్సి వచ్చిందట. ఇక ఆ విషయాలను పక్కనపెడితే రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ సారి నాని సరసన సమంత నటించడానికి ఒకే చెప్పిందని తెలుస్తోంది.
నాని - నాగార్జున మల్టి స్టారర్ మూవీ లో కథానాయిక కోసం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య గత కొంత కాలంగా చాలా వెతుకుతున్నాడు. రీసెంట్ గా నాని సరసన తమిళ్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ని సెట్ చేసినట్లు కథనాలు వచ్చాయి. కానీ రీసెంట్ అప్డేట్ ప్రకారం సమంత నాని జోడిగా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ శ్రద్దా అనే అమ్మాయి నాగ్ కి సెట్ చేశారని చెప్పవచ్చు. మరి మామ సినిమాలో సమంత మరోసారి నటిస్తుందో లేదో చూడాలి.