Begin typing your search above and press return to search.

వేశ్య అని ట్వీట్ చేసిన నెటిజన్ కు సమంత స్ట్రాంగ్ కౌంటర్..!

By:  Tupaki Desk   |   21 Jun 2022 3:30 AM GMT
వేశ్య అని ట్వీట్ చేసిన నెటిజన్ కు సమంత స్ట్రాంగ్ కౌంటర్..!
X
సౌత్ ఇండస్ట్రీలోని మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య - సమంత జంట.. 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ఉమ్మడి ప్రకటనను పంచుకున్నారు.

ప్రేమ వివాహం చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉన్న చై సామ్.. నాలుగేళ్లకే విడిపోతున్నారనే వార్త అభిమానులను షాక్‌ కు గురి చేసింది. ఇది జరిగి తొమ్మిది నెలలు కావొస్తున్నా ఇప్పటికీ ఆ విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఏదొక సందర్భంలో వీరి విడాకులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

చై సామ్ విడిపోయిన తర్వాత ఈ వ్యవహారంలో తప్పెవరిది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. విడాకులు అనేవి పరస్పర అంగీకారంతో జరిగినప్పటికీ.. ఇద్దరి అభిమానులు మాత్రం ఎవరిది మిస్టేక్ అనే దానిపై నెట్టింట ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు.

చైతూ తో విడిపోయినప్పటి నుంచి మెజారిటీ నెటిజన్లు సమంతదే తప్పు అన్నట్లుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఏ ఫోటో షేర్ చేసినా నెగెటివ్ కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ట్రోలర్స్ కు సామ్ తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ వల్గర్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

నాగ చైతన్య ఇప్పుడు మరో హీరోయిన్ తో డేటింగ్ చేసున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. సమంత పై దారుణమైన కామెంట్స్ చేశాడు. ''సమంత ఒక వేశ్య. బట్టలు విప్పి బజారులో తిరగమని చెప్పు. ఈ ఐటెమ్ దాని కోసం మా వాడు దేవదాసులా ఉండాలా?'' అని ట్వీట్ చేస్తూ ఆమెను ట్యాగ్ చేసాడు.

దీనిపై సామ్ స్పందిస్తూ.. “నిజంగా భయపడాలి” అని కామెంట్ పెట్టి.. కొంచెం వెటకారంగా రెండు స్మెలీ ఎమోజీలను జోడించింది. దీంతో వెంటనే సదురు నెటిజన్ ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. సమంత సైతం తన ట్వీట్ ను డిలీట్ చేయడం గమనార్హం. అయితే అప్పటికే ఈ ట్వీట్స్ ని స్క్రీన్ షాట్ తీసుకున్నవారు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

ఇంతకముందు ఓ నెటిజన్ కు సామ్ ఇలానే గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ‘నా నిశ్శబ్దాన్ని అజ్ఞానంగానూ.., నా మౌనాన్ని అంగీకారంగానూ.., నా జాలిని బలహీనతగానూ తప్పుగా భావించకండి’ అని ట్వీట్ చేసింది. 'జస్ట్ సేయింగ్' అనే హ్యాష్ ట్యాగ్ తో ‘జాలికి కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు దీనికీ భయపడేది లేదు అన్నట్లుగా వెటకారంగా ట్వీట్ చేసింది.

ఇకపోతే విడాకుల ప్రకటన తర్వాత చై సామ్ కెరీర్ మీదనే పూర్తిగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా మారిపోయారు.