Begin typing your search above and press return to search.
తీరంలో తీరని విరహంలో సమంత
By: Tupaki Desk | 20 Jun 2017 9:47 AM ISTటాలీవుడ్ బ్యూటీ సమంత మరికొన్ని నెలల్లో పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో చైతు- సమంతల మ్యారేజ్ గ్రాండ్ గా జరగనుంది. ఈలోగా తన ఖాళీ సమయాన్నంతా చైతుకే కేటాయించిన సమంత.. ఇప్పుడు షూటింగ్ లలో బిజీ అయిపోవాల్సి వచ్చింది. ముందుగా అంగీకరించిన ప్రకారం.. సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది సామ్.
ప్రస్తుతం రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషనల్ రూపొందుతున్న రంగస్థలం కోసం.. రాజమండ్రి దగ్గర గ్రామాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీలో సమంతకు సంబంధించిన సీన్స్ అన్నిటినీ మొదటగా పిక్చరైజ్ చేసేలా దర్శక నిర్మాతలు షూటింగ్ షెడ్యూల్స్ ను మార్చుకున్నారు. సామ్ పెళ్లి తేదీకి వీలుగా తమ ప్లాన్స్ ను ఛేంజ్ చేసుకున్నారు. పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో.. తన భాగాన్ని త్వరగా పూర్తి చేసేందుకు సమంత కూడా వీలైనంతగా సహకరిస్తోంది. అయితే.. చైతును వదిలేసి వచ్చిన ఫీలింగ్ మాత్రం అమ్మడిని వెంటాడుతూనే ఉంది. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ ద్వారా తన మనసులోని భావాలని వెలిబుచ్చింది ఈ బ్యూటీ.
చేతిపై మొహం ఆనించుకుని.. ఒక కంటితో కెమేరా వంక చూస్తూ ఇచ్చిన పోజ్ బాగుంది. అయితే. ప్రేమ లేకపోతే ఏమయి ఉండేదో అంటూ సమంత నిలదీస్తోంది కూడా. అయితే.. ఈ భామ వేసుకున్న టాప్ పై కూడా అన్నీ లవ్ సింబల్స్ ఉండడం గమనించాలి. ప్రియుడు దూరమైనా ప్రేమను మాత్రం తనకు అలా దగ్గరగా ఉంచుకుంది సమంత. గోదారి తీరంలో పడుతున్న విరహ వేదనను ఫోటో ద్వారా సామ్ భలే చూపించింది కదూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/