Begin typing your search above and press return to search.

డ్రగ్స్ పై సమంత అలా అనేసిందే

By:  Tupaki Desk   |   22 July 2017 12:59 PM GMT
డ్రగ్స్ పై సమంత అలా అనేసిందే
X
టాలీవుడ్ ని ఇప్పుడు డ్రగ్స్ వివాదం వెంటాడుతోంద. సెలబ్రిటీ అయినా.. స్టార్ అయినా.. సినిమావాళ్లు ఎవరైనా సరే మీడియాకి కనిపిస్తే.. మొదటగా డ్రగ్స్ వివాదం గురించి ప్రశ్నలనే ఎదుర్కోవాల్సి వస్తోంది. కొంత మంది రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఏ మాట చెప్పకుండా తప్పించుకుంటున్నారు.

ఇలా వివాదంలో తల దూర్చకుండా ఎస్కేప్ అవుతున్న వారి జాబితాలో టాలీవుడ్ బ్యూటీ.. అక్కినేని వారింటి కాబోయే కోడలు సమంత కూడా చేరింది. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండడంతో.. ప్రస్తుతం సమంత తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను చకచకా పూర్తి చేస్తోంది. మరోవైపు.. తనకు ఉన్న బ్రాండ్ అండార్స్ మెంట్స్ కు సంబంధించిన పనులనూ చక్కబెట్టేస్తోంది. రీసెంట్ గా ఈ భామ.. తను ప్రచారం చేస్తున్న ఓ మొబైల్ ఫోన్ విక్రయాల కంపెనీ ప్రారంభిస్తున్న కొత్త షాప్ లాంఛింగ్ కోసం హన్మకొండ వచ్చింది.

ఇక్కడ షోరూమ్ ప్రారంభం తర్వాత.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో.. డ్రగ్స్ గురించి రియాక్ట్ అవాల్సిందిగా కోరారు మీడియా ప్రతినిధులు. సహజంగా పదిమందికీ సంబంధించిన అంశం అంటే.. సమంత తన అభిప్రాయం చెబుతుంది కానీ.. డ్రగ్స్ విషయంలో మాత్రం ఎందుకో సింపుల్ గా 'నో కామెంట్' అనేసింది. అంతే కాదు.. భారతీయ మహిళా క్రికెట్ టీం ఫైనల్ కు చేరుకున్న సందర్భంగా బెస్టాఫ్ లక్ చెబుతూ మాట మార్చేసింది కూడా.