Begin typing your search above and press return to search.
సమంత వల్లే బ్రహ్మోత్సవం అలా అయిందా?
By: Tupaki Desk | 17 July 2016 1:00 PM ISTసినీ పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సైన్స్ మీద సినిమాలు తీస్తూ కూడా సెంటిమెంట్లు పాటించేవాళ్లుంటారిక్కడ. స్టార్ హీరోయిన్ సమంతకు కూడా ఓ చిత్రమైన సెంటిమెంటు ఉందట. ఆమె ఎప్పుడూ తాను చేయబోయే కొత్త సినిమా గురించి.. ముందు ఎక్కడా నోరు విప్పదట. తాను ఫలానా హీరోతో.. ఫలానా దర్శకుడితో.. ఫలానా సినిమా చేస్తున్నట్లు చెప్పదట. సినిమా ప్రారంభం అయ్యాకే దాని గురించి మాట్లాడుతుందట. తొలి రోజు షూటింగుకి హాజరయ్యే వరకు తాను చేయబోయే సినిమా గురించి గోప్యంగా ఉంచుతుందట. అలా గోప్యంగా ఉంచిన సినిమాలన్నీ బాగా ఆడాయట. అందుకే సమంతకు అది సెంటిమెంటుగా మారిందట.
ఐతే సమంతకు ఎప్పట్నుంచి ఈ సెంటిమెంటు ఉందో తెలియదు. సమంత కెరీర్లో సక్సెస్ రేట్ ఎక్కువే. ఐతే ఆమె కెరీర్లో రభస.. అంజాన్ (సికిందర్) లాంటి కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాల గురించి ముందే చెప్పేసిందో ఏమో.. ఆ ఫలితాలు చూశాకే ఈ సెంటిమెంటు మొదలైందో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్యే వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ విషయంలో సమంత సెంటిమెంటు పాటించిందా లేదా అన్నదే తెలియాల్సి ఉంది. సమంత సెంటిమెంటు గురించి తెలిసిన వాళ్లు మాత్రం.. ఆమె బ్రహ్మోత్సవం గురించి ముందే మాట్లాడేసి ఉంటుందేమో.. అందుకే ఈ సినిమాకు అంత దారుణమైన ఫలితం వచ్చిందేమో అని సెటైర్లు వేస్తున్నారు. మరి నిజంగా సమంత ఆ తప్పు చేసిందా?