Begin typing your search above and press return to search.

సమంత కళ్లలో అంత బాధెందుకో!!

By:  Tupaki Desk   |   18 April 2017 11:23 AM IST
సమంత కళ్లలో అంత బాధెందుకో!!
X
సోషల్ మీడియా జనాలకు ఫన్ అందించడంలో సౌత్ బ్యూటీ సమంతకు మించినోళ్లు కనిపించరు. ఎప్పుడూ ఒకే రకమైన ఫోటోలు కాకుండా.. రకరకాల పోస్ట్ లతో ఆకట్టుకుంటుంది. సోషల్ అవేర్ నెస్ నుంచి సినిమా ప్రచారం వరకూ.. పర్సనల్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్ అప్ డేట్స్ వరకూ.. సోషల్ మీడియాను ఎలా వాడుకోవచ్చో అన్ని రకాలుగాను ఉపయోగించేసుకుంటుంది ఈ భామ.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసిన సమంత.. 'ఓ ఆడదాని కళ్లలోకి చూసి ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడమే అసలైన అందం అంటే' అంటూ ఓ క్యాప్షన్ పెట్టి మరీ.. తన ఫోటోను షేర్ చేసింది. ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్ ను చూస్తే.. సమంత ఎందుకో తెగ బాధ పడుతోందేమో అనిపించక మానదు. అసలు స్యామ్ కు ఇంత వర్రీ అయిపోవాల్సిన అవసరం ఏంటన్నది అసలు పాయింట్. ఇదేమన్నా సినిమాలోదా అని ఆలోచిస్తే.. రాజు గారి గది2 లో పిక్ అయినా కావచ్చు.. రామ్ చరణ్ సినిమాలో ఫోటో అయినా కావచ్చు. ఈ రెండు కాకుండా.. తమిళ్ లో ఇలాంటి థీమ్ కు దగ్గరగా చేస్తున్న సినిమాలోదైనా కావచ్చు.

ఇవేవీ కాకుండా.. సమంత వదిలిన ఓ క్విజ్ కూడా కావచ్చు. ఎందుకంటే.. ఇలాంటి పజిల్స్ ను తన ఫాలోయర్స్ కు వదలడం సమంతకు అప్పుడప్పుడూ అలవాటే. ఎందుకు అనే విషయం చెప్పలేం కానీ.. సమంత మనసులో ఏముందో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/