Begin typing your search above and press return to search.

పాత ఫోటోలతో ఊరిస్తున్న సమంత

By:  Tupaki Desk   |   25 March 2017 6:29 AM GMT
పాత ఫోటోలతో ఊరిస్తున్న సమంత
X
ఎప్పటికప్పుడు తన ఫోటోలతో ఊరిస్తూనే ఉంటుంది సమంత. ముఖ్యంగా అమ్మడు సోషల్ నెట్వర్కింగ్ పేజీల్లో ఏదో ఒకటి అనునిత్యం రిలీజ్ చేస్తూ.. వాటి వెనుకున్న స్టోరీలు చెబుతూ.. తద్వారా తన అభిమానులను ఫుల్లుగా ఎక్సయిట్ చేస్తుంటుంది. నిన్న కూడా అదే విధంగా చేసింది.

''ప్రేమ నువ్వు ప్రతిరోజూ నన్ను సేవ్ చేస్తుంటావ్'' అంటూ ఒక ఫోటోను షేర్ చేసింది సమంత. ఒక చిట్టి డ్రస్సులో సమంత.. అలాగే పక్కనే నాగ చైతన్య.. ఇద్దరూ కలసి డ్యాన్స్ చేస్తున్నారు. ఈ ఫోటోతో ప్రేమికులమైన తాము కాలాన్ని ఎలా వెల్లిబూర్చుతుంది చెప్పకనే చెప్పింది మన క్వీన్ బ్యూటి. అయితే ఈ ఫోటోలన్నీ ఇప్పటివి కాదులే.

కొన్ని వారాల క్రితం హైదరాబాదులో ఒక హైఫై పార్టీ జరిగింది. ఆ పార్టీని ఇచ్చింది అక్కినేని ఫ్యామిలీ. అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక ఆ పార్టీని ఎందుకు ఇచ్చారు.. ఎప్పుడు ఇచ్చారు.. అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్ గా ఉంచారు. ఇప్పుడు ఆ పార్టీ తాలూకు ఫోటోలను నిధానంగా రిలీజ్ చేస్తూ ఊరిస్తోంది అమ్మడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/