Begin typing your search above and press return to search.
మెల్ బోర్న్ ఫిలిం పెస్టివల్ ల్లో సమంత మెరుపులు!
By: Tupaki Desk | 18 July 2022 10:33 AM GMT'ఫ్యామిలీ మ్యాన్ -2' వెబ్ సిరీస్ తర్వాత సమంత కి పాన్ ఇండియా వైడ్ దక్కిన గుర్తింపు గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితమైన సామ్ క్రేజ్ ఓటీటీ ద్వారా పాన్ ఇండియా వ్యాప్తంగా వెలిగిపోయింది. హిట్ ప్రాంచైజీ సిరీస్ లో నటించడమే సామ్ కెరీర్ ని అలా ఒక్క సారిగా టర్న్ చేసింది.
అటు 'పుష్ప' చిత్రంలో 'ఊ అంటావా మావ' పాటతో హిందీ బెల్ట్ లో మరింత పాపులర్ అయింది. సరిగ్గా అమ్మడి కెరీర్ బాలీవుడ్ లో బిల్డ్ అవ్వడానికి ఈ రెండు అంశాలే కీలకంగా మారాయి. ఆక్రేజ్ తోనే సామ్ హిందీ అవకాశాలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో సమంతకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది.
ఆగస్టు 12న జరగనున్న ఈ వేడుకల్లో సామ్ పాల్గొంటుంది. కోవిడ్ కారణంగా రెండేళ్లగా ఈ ఫెస్టివల్స్ నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకలకు సమంత కూడా హాజరవుతుడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా ఈ విషయంపై స్పందించింది.
'గత సంవత్సరం నేను ఐఎఫ్ ఎఫ్ ఎమ్ లో భాగమయ్యాను. ఎంతో మంది ప్రముఖులతో ఆవేడుకలో భాగమవ్వడం ఉత్సాహాన్ని.. గౌరవాన్ని పెంచింది. వారందరి ఉత్సాహంతో కొత్త శక్తిని కూడగట్టుకోగలిగాను. కోవిడ్ లేకపోవడంతో అన్ని చోట్లకు ప్రయాణించే అవకాశం లభించింది.
ఈ సారి ఆస్ట్రేలియా వేడుకల్లో వ్యక్తిగతంగా పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.ఆ గడియలు కోసం ఎదురు చూస్తున్నాను. భారతీయ సినిమా పండుగలు విదేశాల్లో జరపడం ఎంతో గొప్ప విషయం' అని అన్నారు.
ఫెస్టివల్ డైరెక్టర్ మితు భౌమిక్ లాంగే మాట్లాడుతూ..''సమంతకు ఆస్ట్రేలియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె అభిమానులు ఈవేడుకలో భాగమవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సంవత్సరం ఫెస్టివల్ లో ఆమె ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు' తెలిపారు.