Begin typing your search above and press return to search.
ఒకే సినిమాలో.. స్యామ్, శృతి, నయన్, సిద్ధూ
By: Tupaki Desk | 18 March 2016 11:30 AM GMTదక్షిణాది అందాల భామలను ఇప్పుడు లిస్ట్ చేయమంటే సమంత - శృతిహాసన్ - నయనతారల పేర్లు తప్పకుండా టాప్ ఫైవ్ లోనే వినిపిస్తాయి. వీరంతా ఎవరికి వారే ట్యాలెంటెడ్ పర్సన్స్. టాప్ స్టేజ్ వెలిగిపోతున్న సుందరీ మణులు. మరి ఈ ముగ్గురినీ కలిపి ఓ మల్టీ స్టారర్ తీయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. బడ్జెట్ విషయంలోనే కాదు.. సబ్జెక్ట్ విషయంలోనూ ఈ ముగ్గురినీ ఒక చోటకు చేర్చడం అంత సులభం కాదు.
కానీ ఇప్పుడో మంచి పని కోసం సమంత - శృతి హాసన్ - నయనతారలు ఒక్కటయ్యారు. సందేశం అందించేందుకు తీస్తున్న ఓ షార్ట్ ఫిలింలో ఈ ముగ్గురు భామలు నటించబోతున్నారు. వీరందరికీ తోడు తెలుగు - తమిళ సినిమాల్లో సత్తా చాటుతున్న హీరో సిద్ధార్ధ్ కూడా ఈ షార్ట్ ఫిలింలో నటించనుండడం విశేషం. గతంలో హీరో సిద్ధార్ద్ - హీరోయిన్ సమంతలు ప్రేమించుకు తర్వాత విడిపోయారు. కారణాలు బైటకు చెప్పకపోయినా.. పీటల వరకూ వెళ్లాల్సిన టైంలో వీరి పెళ్లి ఆగిపోయిందనే టాక్ ఉంది. అంతకు ముందు కలిసి నటించిన ఈ జంట.. ఈ బ్రేకప్ తర్వాత ఒక్కసారి కూడా కలిసి నటించలేదు.
ఇప్పుడు తీయబోతున్న షార్ట్ ఫిలింలో.. సిద్ధూ - శామ్స్ జంటగా నటించనుండడం విశేషం. మళ్లీ ఈ జంట కలిసి నటించేందుకు ఒప్పించారంటే.. ఆ కాన్సెప్ట్ అంత పక్కాగా ఉందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇలా ఇంత మంది టాప్ స్టార్స్ తో తీయబోతున్న భారీ మల్టీస్టారర్ షార్ట్ ఫిలింపై ఆసక్తి పెరుగుతోంది.