Begin typing your search above and press return to search.

అఫీషియల్: సమంత సినిమా సైన్ చేసింది

By:  Tupaki Desk   |   19 Aug 2016 7:28 PM IST
అఫీషియల్: సమంత సినిమా సైన్ చేసింది
X
'జనతా గ్యారేజ్' సమంత కెరియర్ లో ఆఖరి సినిమానా? అంటే అవుననే అన్నారు చాలామంది ఔత్సాహికులు. అయితే మన హాట్ లేడీ మాత్రం.. తనకు మాంచి కథలు ఆఫర్ చేస్తే ఖచ్చితంగా సంతకం చేస్తానని.. అలాంటి కథలు కొన్ని వింటున్నానని.. ఒకసారి వినేశాక డెసిషన్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది. కాని ఇందులో నిజం లేదు.. డిసెంబర్ లో పెళ్ళి.. దట్సిట్ అన్నారు రూమర్ రాజాలు. ఇప్పుడు షాకింగ్ న్యూస్ వినండే మరి.

తమిళంలో పొనరమ్ అనే దర్శకుడు వరుతపదాత వలిబార్ సంఘం అనే సినిమాతో సంచలనం సృష్టించాడు. అదేనండీ.. ''కరెంట్ తీగ'' సినిమా ఒక్క ఒరిజినల్ ఫిలిం అదే. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఈ దర్శకుడు ఇప్పుడు ఇదే హీరోతో మరో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండటంతో.. ఇప్పుడు సమంత ఆ సినిమాకు అఫీషియల్ గా సైన్ చేసింది.

ఒక ప్రక్కన తమిళంలో టాప్ స్టార్లయిన విజయ్ - విక్రమ్ - సూర్య వంటి హీరోలతో నటించిన సమంత.. ఇప్పుడు రైజింగ్ స్టార్ శివకార్తికేయన్ తో నటించడం అంటే.. అతగాడి రేంజ్ పడిందా ఈమె రేంజ్ పడిపోయిందా అనే ప్రశ్న ఉత్పన్నమవ్వడం సహజం. కాకపోతే ఈ సినిమాలోని పాత్ర నచ్చే సంతకం చేసింది కాని.. అసలు హీరో రేంజేంటి డైరక్టర్ రేంజేంటి అనే అంచనాలు వేసుకోలేదట మన బంగారం. అది సంగతి.