Begin typing your search above and press return to search.
సమంత.. రెండు సినిమాల్లో ఒకే పాత్ర
By: Tupaki Desk | 15 April 2018 6:33 AM GMTఒక నటుడు లేదా ఒక నటి ఒక తరహా పాత్ర చేశాక మళ్లీ అలాంటిదే చేయడానికి చాలా గ్యాప్ తీసుకుంటారు. తక్కువ వ్యవధిలో ఒకే పాత్ర చేయడానికి కూడా అంగీకరించరు. కానీ సమంత మాత్రం ఏక కాలంలో రెండు సినిమాల్లో ఒకే పాత్ర చేస్తుండటం విశేషం. ఇటీవలే ‘రంగస్థలం’లో పల్లె పడుచుగా కనిపించి మెప్పించిన సామ్.. దీని తర్వాత ‘మహానటి’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో ఆమె జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇది 1960-80ల నాటి నేపథ్యంలో సాగే సినిమా. అప్పటి తరం పాత్రికేయురాలిగా సమంత విభిన్నంగా కనిపిచంబోతోందీ చిత్రంలో.
విశేషం ఏంటంటే.. ఈ సినిమా చేస్తుండగానే ఆమె ‘యు-టర్న్’ సినిమా మొదలుపెట్ అందులోనూ జర్నలిస్టు పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇది కన్నడ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ లేడీ ఓరియెంటెడ్ హార్రర్ థ్రిల్లర్లో సమంత విలేకరి పాత్రలో కనిపించనుంది. ఐతే ఈ చిత్రం వర్తమాన పరిస్థితుల్లో సాగుతుంది కాబట్టి ఈ తరం జర్నలిస్టుగా సమంత భిన్నంగా కనిపించబోతోంది. రెండు సినిమాల్లో జర్నలిస్టు పాత్రే కానీ.. వేర్వేరు కాలాల్లో సాగే సినిమాలు కాబట్టి పాత్రలు భిన్నంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అప్పటి జర్నలిస్టులకు.. ఇప్పటి జర్నలిస్టులకు అసలు పోలికే ఉండదు కాబట్టి రెండు పాత్రల్లో సమంత వైవిధ్యం చూపించే అవకాశాలున్నాయి. ఐతే ఒకేసారి ఇలా ఒకే పాత్రను భిన్నంగ చేసే అదృష్టం అందరికీ రాదు. ఈ రెండు సినిమాలతో సమంత నటిగా ఇంకొన్ని మెట్లు ఎక్కుతుందని భావిస్తున్నారు.